మరో భారీ దోపిడీ, కంటైనర్ నుంచి రూ.15 కోట్ల విలువైన మొబైల్స్ లూటీ

  • Publish Date - October 21, 2020 / 01:46 PM IST

mobile phones robbery: తమిళనాడులో కృష్ణగిరి జిల్లా హైవేపై భారీ దోపిడీ జరిగింది. రూ.15 కోట్ల విలువ చేసే మొబైల్స్ లూటీ చేశారు. కంటైనర్ డ్రైవర్ ను చితకబాది మరీ దుండగులు ఫోన్లు ఎత్తుకెళ్లారు. కాంచీపురం నుంచి ముంబైకి కంటైనర్ లో తీసుకెళ్తున్న ఎంఐ కంపెనీ మొబైల్స్ ను చోరీ చేశారు.




ఏపీలో ఇటీవలే ఇదే తరహా చోరీలు జరిగాయి. చిత్తూరు జిల్లా నగరి, గుంటూరు జిల్లా మంగళగిరి హైవేలపై ఇదే తరహాలో దోపిడీలు జరిగాయి. కంటైనర్ లో తీసుకెళ్తున్న ఫోన్లను లూటీ చేశారు. ఇది కంజర్ భట్ గ్యాంగ్ పనే అని పోలీసులు తేల్చారు.