భారతదేశంలో ఓ వైపు కరోనా భయపడుతున్నా..కామాంధులు మాత్రం రెచ్చిపోతున్నారు. సభ్య సమాజం తలదించుకొనేలా వ్యవహరిస్తున్నారు. అభం, శుభం తెలియని పసికందుల నుంచి మొదలుకుని..ముసలి వాళ్లపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు.
తాజాగా త్రిపురలో 15 సంవత్సరాల బాలికపై ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. Sepahijala జిల్లాలో 15 సంవత్సరాల బాలిక 8వ తరగతి చదువుతోంది. ఈమె ఉంటున్న ఇంట్లోకి ఐదుగురు వ్యక్తులు ప్రవేశించి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుందని పోలీసులు వెల్లడించారు. జరిగిన ఘోరాన్ని సోమవారం తల్లిదండ్రులకు చెప్పింది. అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇతడిని కోర్టులో ప్రవేశపెట్టగా..ఐదు రోజుల జ్యుడిషియల్ కస్టడి విధించింది. పరారీలో ఉన్న నలుగురి కోసం గాలిస్తున్నారు.