ఏడాదిలో నాలుగోది: తక్కువ మార్కులొచ్చాయని ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

తక్కువ మార్కులొచ్చాయనే మనస్తాపంతో 19ఏళ్ల ఐఐటీ మద్రాస్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చెన్నైలో శుక్రవారం నవంబరు 8న జరిగింది. కాగా, ఏడాదిలో ఐఐటీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం నాలుగోది కావడం విషాదకరం. ప్రాథమిక విచారణలో పోలీసులకు ఎటువంటి సూసైడ్ నోట్ దొరకలేదు. దీంతో అనుమానస్పద కేసుగా నమోదు చేసుకున్నారు. 

కేరళకు చెందిన స్టూడెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో ఫాతిమా చదువుతోంది. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయనే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఇది చాలా విషాదకరమైన విషయం. హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్‌లో తొలి సంవత్సరం చదువుతున్న అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని నవంబరు 8న ఆత్మహత్యకు పాల్పడింది. విద్యార్థులతో పాటు, స్టాఫ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆ కుటుంబానికి, విద్యా సంస్థకు ఇది తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలనుకుంటున్నాం’ అని ఐఐటీ మద్రస్ తెలిపింది. 

‘ఫాతిమా ఆత్మహత్యకు యత్నించడం ఇదే తొలిసారి. కుటుంబానికి దూరంగా హాస్టల్ లో ఉంటుంది. ఎక్కువగా ఇంటిపై బెంగగా ఫీలయ్యేది. ఇటీవల జరిగిన ఇంటర్నల్ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయి. ఈ కారణాలతో ఫాతిమా ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చు’ అని పోలీస్ అధికారి తెలిపారు.