ఢిల్లీలోని DND ఫ్లైఓవర్ మీద శుక్రవారం (సెప్టెంబర్ 20, 2019) తెల్లవారుజామున పెద్ద ప్రమాదం చోటుచేసుకుంది. గర్భిణి మహిళను అంబులెన్సులో నోయిడా ఆసుపత్రి నుంచి సఫ్దర్‌ఫ్‌జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని జాయింట్ పోలీస్ కమిషనర్ అలోక్ కుమార్ తెలిపారు.
వివరాలు.. శుక్రవారం ఉదయం 4: 30గంటలకు ఫ్లైఓవర్ మీద ఆగి ఉన్న ట్రక్కును అంబులెన్స్ ఢీకొంది. అందులో గర్భిణీ స్త్రీ, ఆమె భర్త వారి ఇద్దరు పిల్లలు, నర్సింగ్ సిబ్బంది ప్రయాణిస్తున్నరు. అయితే ఈ ఘటనలో రెండేళ్ల కుమారుడు, నర్సింగ్ సిబ్బంది చనిపోయారు. అనంతరం గర్భిణీ స్త్రీ, ఆమె భర్త సురేష్, కుమార్తె, అంబులెన్స్ డ్రైవర్ ను AIIMSకు తరలించి చికిత్స నిర్వహిస్తున్నట్లు అలోక్ కుమార్ తెలిపారు.