సెల్ఫీ కోసం నదిపై ఉన్న బ్రిడ్జి ఎక్కారు. ఆ సమయానికి ట్రైన్ రాదనుకుని సెల్ఫీల్లో మునిగిపోయారు. హఠాత్తుగా రైలు రావడంతో ప్రాణాలు కాపాడుకోవడానికి నదిలోకి దూకే ప్రయత్నం చేశారు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్‌గురి జిల్లాలో ఆదివారం జరిగిందని గవర్నమెంట్ రైల్వే పోలీస్(జీఆర్పీ) తెలిపారు.
మైనగురిలోని కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుంటుున్న స్టూడెంట్స్ అంతా ఘిస్ నది దగ్గర్లోని ఓడ్లాబారి ప్రాంతానికి పిక్‌నిక్ ప్రోగ్రాంపై వచ్చారు. అందులో ఇద్దరు యువతులు సెల్ఫీ తీసుకునేందుకు బ్రిడ్జిపై ఉన్న రైల్వే బ్రిడ్జి ఎక్కారు. సెల్ఫీలు తీసుకుంటూ ట్రైన్ వచ్చే సంగతి మర్చిపోయారు.
అదే సమయంలో సిలిగురి నుంచి వస్తున్న అలీపూర్‌దార్ ట్రైన్ వారిలో ఒకరిని గుద్దేసింది. నదిలో పడిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. మరో యువతి ప్రాణాలు దక్కించుకునేందుకు నీళ్లల్లోకి దూకేసింది. అయినప్పటికీ తీవ్రమైన గాయాలతో బయటికొచ్చింది. నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు.