×
Ad

Train Hit 3 Children Killed : పట్టాలపై కూర్చుని పండ్లు తింటున్న చిన్నారులను ఢీకొట్టిన ట్రైన్‌.. ముగ్గురు దుర్మరణం

పంజాబ్‌లోని కిరత్‌పూర్‌ సాహిబ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు. రైలు పట్టాలపై కూర్చుని పండ్లు తింటున్న చిన్నారులను ట్రైన్‌ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

  • Published On : November 28, 2022 / 08:25 AM IST

train collision

Train Hit 3 Children Killed : పంజాబ్‌లోని కిరత్‌పూర్‌ సాహిబ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని ముగ్గురు చిన్నారులు దుర్మరణం చెందారు. రైలు పట్టాలపై కూర్చుని పండ్లు తింటున్న చిన్నారులను ట్రైన్‌ ఢీకొట్టింది. దీంతో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. సట్లేజ్‌ నదిపై ఉన్న లొహంద్‌ రైల్వే బ్రిడ్జి సమీపంలో నలుగురు చిన్నారులు చెట్లకు ఉన్న పండ్ల తెంపుకున్నారు. అనంతరం రైల్వే పట్టాలపై కూర్చుకుని వాటిని తింటున్నారు. అదే సమయంలో సహరాన్‌పూర్‌ నుంచి హిమాచల్‌ ప్రదేశ్‌ వెళ్తున్న రైలు అటుగా వచ్చింది. దానిని గమనించకుండానే ఆ చిన్నారులు పండ్లను తింటూ ఉండిపోయారు.

Congo Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 60 మందికి పైగా మృతి!

దీంతో రైలు వారిని ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. మరొక చిన్నారికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.