Gold ornaments seized : తమిళనాడులో 302 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం

త్వరలో శాసనసభ ఎన్నికలు జరిగే తమిళనాడులో రెండు వేర్వేరు చోట్ల నిర్వహించిన వాహన తనిఖీల్లో 302 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

302 kg Gold ornaments seized,police and tamlinadu election commsision in checkings : త్వరలో శాసనసభ ఎన్నికలు జరిగే తమిళనాడులో రెండు వేర్వేరు చోట్ల నిర్వహించిన వాహన తనిఖీల్లో 302 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సేలం జిల్లా పెరియారి వద్ద శనివారం రాత్రి తనిఖీలు నిర్వహించిన ఎన్నికల సంఘం సిబ్బంది, పోలీసులు ఒక వాహానంలో తరలిస్తున్న 232 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సమారు 37 కోట్ల 57 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.

జ్యూయలరీ షాపుల్లో డెలివరీ ఇవ్వటానికి తీసుకు వెళుతున్నట్లు డ్రైవర్ చెప్పినా వాటికి సంబంధించి సరైన పత్రాలు చూపించనందున…. వాటిని తరలిస్తున్న ముగ్గురుని అదుపులోకి తీసుకుని ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
మరోక ఘటనలో తిరువరూరు జిల్లా వాదమూరు చెక్ పోస్టు వద్ద 20 కోట్ల రూపాయలు విలువైన 65 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు, అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పాత ఆభరణాల స్ధానంలో కొత్తవి తయారు చేయటానికి వీటిని తీసుకు వెళుతున్నట్లు డ్రైవర్ తెలిపాడు.

వాటికి సరైన పత్రాలు చూపించకపోవటంతో ఆభరణాలను, వాటిని రవాణా చేస్తున్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసునమోదు చేశారు. బంగారాన్ని గంగవల్లి ట్రెజరీకి తరలించారు. కాగా రెండు తనిఖీల్లో పట్టుబడిన వాహనాలు సీక్వెల్ లాజిస్టిక్స్ అనే సంస్ధకు చెందినవికావటం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు