Train Hit Sheeps Died : రైలు ఢీకొని 335 గొర్రెలు మృతి

మహబూబ్ నగర్ జిల్లాలో రైలు ఢీకొని 335 గొర్రెలు మృతి చెందాయి. ఊర కుక్క‌లు వెంబ‌డించ‌డంతో భ‌యంతో గొర్రెలు గ్రామ శివారులోని రైలు ప‌ట్టాల‌పైకి వ‌చ్చాయి. అప్పుడే వేగంగా వ‌చ్చిన రైలు ఆ గొర్రెల‌ను ఢీకొట్టింది. దీంతో 335 గొర్రెలు మృతి చెందాయి.

Train Hit Sheeps Died : మహబూబ్ నగర్ జిల్లాలో రైలు ఢీకొని 335 గొర్రెలు మృతి చెందాయి. ఊర కుక్క‌లు వెంబ‌డించ‌డంతో భ‌యంతో గొర్రెలు గ్రామ శివారులోని రైలు ప‌ట్టాల‌పైకి వ‌చ్చాయి. అప్పుడే వేగంగా వ‌చ్చిన రైలు ఆ గొర్రెల‌ను ఢీకొట్టింది. దీంతో 335 గొర్రెలు మృతి చెందాయి. ఈ విషాద ఘ‌ట‌న దేవ‌ర‌క‌ద్ర మండ‌లం కౌకుంట్ల గ్రామ శివారులో చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. కౌకుంట్లకు చెందిన పెద్ద మాసన్న, దూలన్న, తిరుపతయ్యకు చెందిన దాదాపు 500 గొర్రెల‌ను గురువారం రాత్రి గ్రామ రైతు వేదిక వద్ద ఆపారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సయమంలో ఊర కుక్కలు గొర్రెల మందపై దాడి చేశాయి. దీంతో భయంతో గొర్రెలు గ్రామ శివార్ల‌లోకి పరుగులు పెట్టాయి. దగ్గరలోని రైల్వే ట్రాక్‌ దాటుతుండగా ఆ సమయంలో వచ్చిన రైలు గొర్రెల‌ను ఢీకొట్టింది.

Srikakulam Train Accident : శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం.. రైలు ఢీకొని ఐదుగురు దుర్మరణం

దీంతో మాసన్నకు చెందిన‌ 160 గొర్రెలు, దూలన్నవి 100 గొర్రెలు, తిరుపతయ్యవి 75 గొర్రెలు మొత్తం 335 గొర్రెలు మృతి చెందాయి. స‌మాచారం అందుకున్న‌ తాసిల్దార్‌ జ్యోతి, ఎంపీడీవో శ్రీనివాసులు, పశువైద్యులు జీసన్‌అలీ ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మృతి చెందిన గొర్రెల విలువ రూ.33.50 లక్షలు ఉంటుందని అంచన వేశారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ట్రెండింగ్ వార్తలు