ఎవరు చంపారు : ట్రక్కు కంటెయినర్ లో 39 శవాలు

 ఓ ట్రక్కు కంటెయినర్ లో 39 మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు లండన్ పోలీసులు. బల్గేరియా నుంచి కంటెయినర్ వచ్చినట్లు బ్రిటీష్ పోలీసులు భావిస్తున్నారు. ఇదొక విషాద సంఘటన అని,పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయి ట్రక్కులో పడి ఉన్నారని ఎసెక్స్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.

లండన్ కి తూర్పున గ్రేస్ లోని ఒక పారిశ్రామిక పార్కు దగ్గర ఈ కంటెయినర్ ని గుర్తించినట్లు తెలిపారు. ఐర్లాండ్ నుండి పడవలకు ప్రధాన ఓడరేవులలో ఒకటైన వేల్స్ వాయువ్య కొనలోని హోలీహెడ్ దగ్గర శనివారం ట్రక్ బ్రిటన్ కి ప్రవేశించినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. ట్రక్కు డ్రైవర్ ని ఉత్తర ఐర్లాండ్ కి చెందిన వ్యక్తిగా గుర్తించామని,అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితులను గుర్తించే పనిలో ఉన్నామని తెలిపారు. మొత్తం 39మంది మృతులలో 38మంది పెద్దలు ఉండగా,ఒకరు టీనేజర్ ఉన్నారని  పోలీసులు తెలిపారు.

మరోవైపు ఈ విషాద ఘటన పట్ల బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్స్ స్పందించారు. ఈ విషయమై ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలుసుకుంటున్నానని ఆయన తెలిపారు. అసలు ఏం జరిగిందని ఎస్టాబ్లిష్ చేసేందుకు ఎసెక్స్ పోలీసులతో హోమ్ ఆఫీస్ పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఎసెక్స్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రిటన్ ఇంటీరియర్ మినిస్టర్, హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్ మాట్లాడుతూ.. ఈ విషాద సంఘటనతో దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు.