Vijayawad Murder Case : విజయవాడ హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

విజయవాడ దుర్గా అగ్రహారంలో జూన్ 25న జరిగిన హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని విజయవాడ నగర డీసీపీ విక్రాంత్ పాటిల్ చెప్పారు.

Vijayawada Murder Case

Vijayawad Murder Case : విజయవాడ దుర్గా అగ్రహారంలో జూన్ 25న జరిగిన హత్య కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశామని విజయవాడ నగర డీసీపీ విక్రాంత్ పాటిల్ చెప్పారు. కండ్రిగ కు చెందిన రామారావుగా మృతుడిని  గుర్తించామని,  సీసీటీవీ ఫుటేజి ఆధారంగా నిందితులను అరెస్టు  చేసినట్లు ఆయన చెప్పారు.

గత నెల 16న ప్రేమ విషయమై పంచాయితీ జరిగింది.  మైనర్ బాలిక బాబాయి మురళి పంచాయితీ చేసారు. కొరుకూరి రవీంద్ర రెండుసార్లు రామారావుకి ఫోన్ చేసి బెదిరించాడు. రామారావు తనను చంపేస్తాడనే భయంతోనే   రవీంద్ర ఈ హత్య చేయించాడని ఆయన చెప్పారు.  నిందితులు ఏడుగురిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని డీసీపీ తెలిపారు.

కోతల‌‌ శివ, కొరుకూరి రవీంద్ర, అశోక్ కుమార్, కరీం, మురళి, వినయ్ కుమార్, నిహాంత్ లను రిమాండ్ కు పంపాం…రౌడీ షీటర్లైన కోతల శివ, కొరుకూరి రవీంద్ర, అశోక్ కుమార్ ఒక వారం కౌన్సిలింగ్‌కు హాజరు కాలేదని .. దానితో వారిని గాలించి పట్టుకున్నామని ఆయన తెలిపారు. తదుపరి విచారణలో ఇంకెవరైనా ఉన్నారా అనేది తేలుతుంది.. ఇప్పుడు అరెస్టు అయిన వారిపైన కూడా రౌడీషీట్ ఓపెన్ చేస్తామని డీసీపీ చెప్పారు.