Wife Poured Hot Oil Husband : పర స్త్రీ వ్యామోహంలో పడిన భర్తపై వేడి నూనె పోసిన భార్య
హైదరాబాద్ కుల్సుంపురలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవ ఘర్షణకు దారితీసింది. భర్తపై వేడి వేడి నూనె పోయడంతో శరీరం కాలిపోయింది. బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉంది.
- bheemraj
- Updated on- September 7, 2022 / 09:16 PM IST
wife poured hot oil on husband
Wife Poured Hot Oil Husband : హైదరాబాద్ కుల్సుంపురలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య గొడవ ఘర్షణకు దారితీసింది. భర్తపై వేడి వేడి నూనె పోయడంతో శరీరం కాలిపోయింది. బాధితుడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల కథనం ప్రకారం..విజయవాడకు చెందిన చెందిన గిరిధర్‌లాల్, రేణుక దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు మూడేళ్ల క్రితం జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ జియాగూడలోని కుల్సుంపురలో నివాసం ఉంటున్నారు.
మాంసం వ్యాపారం నిర్వహించే గిరిధర్‌లాల్ జియాగూడ కబేళాలో పని చేస్తూ ఉండేవాడు. అయితే గత కొంత కాలంగా గిరిధర్‌లాల్ పర స్త్రీ వ్యామోహంలో పడి.. భార్యాపిల్లలను పట్టించుకోవడం మానివేశాడు. ఐదు నెలలుగా ఓ మహిళ వద్ద ఉంటూ.. మూడు రోజుల కిందట భార్య వద్దకు వచ్చాడు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గత మూడు రోజులుగా వాగ్వాదాలు జరుగుతున్నాయి.
Hyderabad Crime : చిన్న గొడవ.. క్షణికావేశంలో భర్తపై కత్తితో దాడి
ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 6వ తేదీన ఉదయం వారిద్దరి మధ్య మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. పర స్త్రీ వ్యామోహంలో పడిన భర్త.. కుటుంబాన్ని విస్మరించడంతో రేణుక విసిగిపోయారు. ఎన్నిసార్లు చెప్పినా భర్త ప్రవర్తన మారడం లేదంటూ గొడవపడ్డారు. క్షణికావేశంలో భర్తపై వేడి వేడి నూనె పోయడంతో శరీరం పూర్తిగా కాలిపోయింది.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడిని చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రేణుకను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త ప్రవర్తనపై రేణుక గతంలోనూ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
