Young Man Died : శరన్నవరాత్రుల్లో అపశ్రుతి.. గర్బా డ్యాన్స్ చేస్తూ గుండె పోటుతో యువకుడు మృతి
గుజరాత్‌లో విషాదం నెలకొంది. శరన్నవరాత్రుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ యువకుడు గర్బా డ్యాన్స్ చేస్తూ గుండె పోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన ఆనంద్ జిల్లాలో చేటుచేసుకుంది.
- bheemraj
- Published On : October 4, 2022 / 07:29 AM IST
young man died
Young Man Died : గుజరాత్‌లో విషాదం నెలకొంది. శరన్నవరాత్రుల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ యువకుడు గర్బా డ్యాన్స్ చేస్తూ గుండె పోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన ఆనంద్ జిల్లాలో చేటుచేసుకుంది. తారాపూర్‌లోని ఆతీ శివశక్తి సొసైటీలో ఆదివారం సాయంత్రం గర్బా నిర్వహించారు. ఈ సందర్భంగా యువతీయువకులు చుట్టూ తిరుగుతూ పాటలకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్నారు.
Fire Broke Out Three Killed : దుర్గామాత మండపంలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి
వీరేంద్ర సింగ్ రమేష్ భాయ్ రాజ్‌పుత్ అనే 21 ఏళ్ల యువకుడు కూడా ఇందులో పాల్గొన్నాడు. అందరితో కలిసి గర్బా డ్యాన్స్ చేశాడు. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. షాకైన తొటివారు ఎంత ప్రయత్నించినా అతడు కదలలేదు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆ యువకుడు గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
