Fire Broke Out Three Killed : దుర్గామాత మండపంలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో దుర్గామాత పూజ సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతి చెందగా, మరో 60 మంది గాయపడ్డారు.

Fire Broke Out Three Killed : దుర్గామాత మండపంలో అగ్నిప్రమాదం.. ముగ్గురు మృతి

Fire Broke Out Three Killed : ఉత్తరప్రదేశ్‌లోని భదోహిలో దుర్గామాత పూజ సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతి చెందగా, మరో 60 మంది గాయపడ్డారు. భదోహిలోని దుర్గామాత మండపంలో పూజలు చేస్తున్నారు. ఇందులో భాగంగా హారతి ఇస్తుండగా ప్రమాదవశాత్తు మండపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దీంతో దుర్గామాత మండపం పూర్తిగా కాలిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజ్ తో మంటలను అదుపుచేశారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో మండపంలో 150 మంది ఉన్నారని జిల్లా మేజిస్ట్రేట్‌ గౌరంగ్‌ రాఠీ పేర్కొన్నారు.

Fire Accident : గణేష్ మండపంలో భారీ అగ్నిప్రమాదం

షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నామని చెప్పారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ ఉన్నారని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.