Fire Accident : గణేష్ మండపంలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్ మల్కాజిగిరిలోని గణేష్ మండపంలో అగ్ని ప్రమాదం జరిగింది. విష్ణుపురి కాలనీలోని మైత్రి నివాస్ అనే అపార్ట్‌మెంట్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

Fire Accident : గణేష్ మండపంలో భారీ అగ్నిప్రమాదం

Updated On : September 12, 2021 / 12:21 PM IST

fire in Ganesh mandapam : హైదరాబాద్ మల్కాజిగిరిలోని గణేష్ మండపంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు కార్లు, 10 ద్విచక్ర వాహనాలు దగ్ధం అయ్యాయి. విష్ణుపురి కాలనీలోని మైత్రి నివాస్ అనే అపార్ట్‌మెంట్ లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో బుధవారం (ఆగస్టు 4, 2019) తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంబంవించింది. గణేష్ మండపంలో ఏర్పాటు చేసిన అఖండ దీపాన్ని వెలిగిస్తుండగా అనుకోకుండా మంటలు ఎగిసి మండపమంతా వ్యాపించాయి. గణేష్ మండపాన్ని అందంగా అలంకరించిన డెకరేషన్ వస్త్రాలకు మంటలు అంటుకున్నాయి.

వెంటనే అపార్ట్‌మెంట్ వాసులు అప్రమత్తతతో ప్రాణ నష్టం తప్పింది. మంటలు ఎగిసి పడటంతో స్థానికులు మంటలు ఆపే ప్రయత్నం చేయగా ఫలితం లేకుండా పోయింది. రెండు కార్లు, పది బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మండపం మొత్తం కాలిపోయింది.

అపార్ట్‌మెంట్ లో పార్క్ చేసిన ఇతర వాహనాలను స్థానికుల సహాయంతో బయటకు తీసుకొచ్చారు. సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.