సిద్దిపేట అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
సిద్దిపేట అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డికి ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. నర్సింహారెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఏసీబీ అధికారులు నర్సింహారెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు చేశారు.
నర్సింహారెడ్డి రూ.5 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించాడు. నర్సింహారెడ్డి బ్యాంక్ బ్యాలెన్స్ రూ.6.37 లక్షలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కిలోన్నర బంగారు ఆభరణాలు, రూ.5.33 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
గోల్కొండలో విల్లా, శంకరక్ పల్లిలో 14 ప్లాట్లను అధికారులు గుర్తించారు. జహీరాబాద్, సిద్దిపేట, మహబూబ్ నగర్ లో 20 ఎకరాల వ్యవసాయ భూమి, 2 కార్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.