ఏపీ, తెలంగాణలో రూ.100కోట్ల ఆస్తులు : దేవికారాణి ఆస్తుల చిట్టా విడుదల

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఈఎస్‌ఐ స్కామ్‌ లో ప్రధాన నిందితురాలు ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి ఆస్తుల చిట్టాను ఏసీబీ రిలీజ్ చేసింది. దేవికారాణి రూ.100 కోట్లకు పైగా

  • Publish Date - December 5, 2019 / 01:07 PM IST

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఈఎస్‌ఐ స్కామ్‌ లో ప్రధాన నిందితురాలు ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి ఆస్తుల చిట్టాను ఏసీబీ రిలీజ్ చేసింది. దేవికారాణి రూ.100 కోట్లకు పైగా

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఈఎస్‌ఐ స్కామ్‌ లో ప్రధాన నిందితురాలు ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి ఆస్తుల చిట్టాను ఏసీబీ రిలీజ్ చేసింది. దేవికారాణి రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది. తెలంగాణలోనే కాదు ఏపీలోనూ ఆమె భారీగా ఆస్తులు కూడబెట్టింది. డిసెంబర్ 3న హైదరాబాద్, తిరుపతి, కడపలో ఏసీబీ అధికారులు దేవికారాణి కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహించి భారీ స్థాయిలో ఆస్తులను గుర్తించారు. సర్కారీ లెక్కల ప్రకారం వీటి విలువ రూ. 23 కోట్లని తేల్చారు. అయితే మార్కెట్ ధరలతో పోలిస్తే రూ. 100 కోట్లకుపైగా ఉండొచ్చని భావిస్తున్నారు.

దేవికారాణి భారీగా నగలు కొన్నట్లు గుర్తించారు. ఆమె ఒక్క పీఎంజే జ్యూవెలర్స్‌కు రూ.7.3కోట్లు చెల్లించింది అంటే.. నగల పట్ల ఆమెకు ఎంత పిచ్చి ఉందో అర్థం చేసుకోవచ్చు. సోమాజిగూడ, జూబ్లీహిల్స్, వైజాగ్ తదితర ప్రాంతాల్లో దేవికకు కోట్ల విలువైన ఇళ్ల స్థలాలు ఉన్నాయి. దేవికా రాణి అసలు ఆదాయానికి, వెలుగు చూసిన ఆస్తులకు ఏ మాత్రం సంబంధం లేదని అదంతా అక్రమంగా సంపాదించినట్లు తెలుస్తోందని అధికారులు భావిస్తున్నారు.

ఔషధాల కుంభకోణంలో కళ్లు తిరిగే అవినీతి బయటపడుతోంది. దేవికారాణి భర్త రిటైర్డ్ డాక్టర్ గురుమూర్తిని ఏసీబీ అధికారులు బుధవారం అరెస్ట్ చేసి చంచల్ గూడకు జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. భార్య తరఫున భర్త అవినీతి వ్యవహారాలు నడిపినట్టు విచారణలో తేలింది. 

ఈఎస్‌ఐ స్కామ్‌ లో దేవికారాణికి ఆస్తులు చిట్టా:
* వంద కోట్లకు పైగా ఆస్తులు
* నారాయణగూడలోని ఇండియన్ బ్యాంక్ లో రూ.34లక్షల ఫిక్స్ డ్ డిపాజిట్లు
* 23 బ్యాంకుల్లో రూ. 1.23 కోట్ల నగదు
* దేవికారాణి ఇంట్లో రూ. 25.72లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు సీజ్
* దేవికారాణి ఇంట్లో రూ. 8.40లక్షల నగదు, రూ.7లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు సీజ్
* రూ. 20 లక్షల ఇన్నోవా కారు, రూ. 60 వేల మోటర్ బైక్ సీజ్ చేసిన ఏసీబీ
* వేర్వేరు చోట్ల దేవికారాణి పేరిట రూ.15 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు
* వీటి విలువ బహిరంగ మార్కెట్ లో రూ.100 కోట్లపైనే
* ఒక్క పీఎంజే జ్యూయలర్స్‌కే రూ.7.3 కోట్లు చెల్లించినట్టు గుర్తింపు