కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఐదుగురు మృతి

కరీంనగర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గంగాధర మండలం కురిక్యాల గ్రామం దగ్గర టాటా ఏస్‌ను గ్రానైట్‌ లారీ ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందగా...

  • Publish Date - February 9, 2020 / 02:02 AM IST

కరీంనగర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గంగాధర మండలం కురిక్యాల గ్రామం దగ్గర టాటా ఏస్‌ను గ్రానైట్‌ లారీ ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందగా…

కరీంనగర్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గంగాధర మండలం కురిక్యాల గ్రామం దగ్గర టాటా ఏస్‌ను గ్రానైట్‌ లారీ ఢీకొట్టింది. ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందగా… ఆస్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు చనిపోయారు. ఆటోలో ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహాన్ని అరగంటపాటు శ్రమించి పోలీసులు బయటికి తీశారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం ఆరుగురు ప్రయాణికులు ఉండగా.. ఐదుగురు మృతి చెందడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఆటో కరీంనగర్ నుంచి జగిత్యాల వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

మృతుల్లో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారున్నారు. మృతులు ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుల కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చనిపోయిన వారంతా రోజు కూలీలుగా పని చేస్తున్నారే. అంతా ఆటోలో ప్రయాణిస్తున్నారు. ఆటో కరీంనగర్ నుంచీ జగిత్యాల వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగా జిల్లాల్లో కరీంనగర్ కూడా ఉంది. ప్రధానంగా రోడ్లపై మలుపులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు… కేసు నమోదు చేసి… దర్యాప్తు చేస్తున్నారు.

* కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
* టాటా ఏస్‌ను ఢీకొన్న గ్రానైట్ లారీ.. ఐదుగురు మృతి
* ఆటోలోనే ఇరుక్కుపోయిన డ్రైవర్ మృతదేహం

* అరగంటపాటు శ్రమించి బయటికి తీసిన పోలీసులు
* మృతులు మ్యాక బాబు, మ్యాక నర్సయ్య, మ్యాక శేఖర్, గడ్డం అంజయ్య