Ginger Garlic Paste : బాబోయ్.. ఈ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తింటే మంచాన పడటం ఖాయం..! పోలీసులు దాడుల్లో షాకింగ్ విషయాలు

Ginger Garlic Paste : కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లితోనే పేస్ట్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు కూల్ డ్రింక్స్ ను కూడా పోలీసులు సీజ్ చేశారు. దీనికి సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు.

Ginger Garlic Paste

Ginger Garlic Paste : అగ్గిపుల్ల నుంచి సబ్బుబిళ్ల వరకు కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఇప్పుడు ఎక్కడ చూసినా కల్తీ, నకిలీ మాటలే వినిపిస్తున్నాయి. మార్కెట్ లో ప్రతి వస్తువుని కేటుగాళ్లు కల్తీ చేస్తున్నారు. కాసుల కక్కుర్తితో దిగజారిపోతున్నారు. నకిలీలు, కల్తీలతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇప్పటికే ఐస్ క్రీమ్ లు, చాక్లెట్లు, పాలను కల్తీ చేసిన కేటుగాళ్లు ఇప్పుడు అల్లం, వెల్లుల్లి పేస్ట్ ని కూడా వదల్లేదు. తెలంగాణలో మరో నకిలీ దందా బయటపడింది. హైదరాబాద్ లో కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠా గుట్టు రట్టు అయ్యింది.

కాటేదాన్ లో ఎస్ఓటీ పోలీసులు చేసిన దాడుల్లో షాకింగ్ నిజాలు వెలుగుచూశాయి. కల్తీ ఉత్పత్తులు తయారు చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. కుళ్లిపోయిన అల్లం, వెల్లుల్లితోనే పేస్ట్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు కూల్ డ్రింక్స్ ను కూడా పోలీసులు సీజ్ చేశారు. దీనికి సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు.(Ginger Garlic Paste)

Also Read..Chocolates : ఈ చాక్లెట్లు తింటే చావే..! హైదరాబాద్‌లో దారుణం.. పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు

కాటేదాన్ పారిశ్రామిక వాడలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్, మ్యాంగో కూల్ డ్రింక్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 500 కేజీల నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు లిటిల్స్ చాంప్స్ పేరుతో తయారు చేస్తున్న మ్యాంగో డ్రింక్స్ ను సీజ్ చేశారు. కుళ్లిన అల్లం, వెల్లుల్లితో పేస్ట్ తయారు చేస్తున్నారు. ఘాటుగా ఉండేందుకు అల్లం వెల్లుల్లి పేస్ట్ లో ఎసిటిక్ యాసిడ్ తో పాటు ప్రమాదకరమైన రసాయనాలు కలుపుతున్నారు కంత్రీగాళ్లు.

Also Read..Ice Cream : ఐస్‌క్రీమ్ తింటున్నారా? బీ కేర్ ఫుల్, ఎంత ప్రమాదమో తెలుసా?

500 కేజీల పేస్ట్, ఒక టన్ను వెల్లుల్లి, హానికారక కెమికల్స్ సీజ్:
మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెల్లుల్లి పాయల పొట్టును సైతం పేస్ట్ తయారీలోనే కలుపుతున్నారు. పరిశ్రమలో ఎటుచూసినా అపరిశుభ్రతే ఉంది. మురుగు నీటిని వాడుతున్నారు. ప్రమాదకర పదార్ధాలు, హానికారక రసాయనాలు వాడుతున్నట్లు గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారు. 500 కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్, భారీగా మ్యాంగో కూల్ డ్రింక్స్, ప్రమాదకరమైన రసాయనాలు, మనుషుల ప్రాణాలు తీసే తెల్లటి పౌడర్, 210 లీటర్ల ఎసిటిక్ యాసిడ్, 550 కేజీల నాన్ వెజ్ మసాల ప్యాకెట్స్, ఒక టన్ను వెల్లుల్లిని సీజ్ చేశారు. ఇద్దరు నిర్వాహాకులను అరెస్ట్ చేశారు.