Ice Cream : ఐస్‌క్రీమ్ తింటున్నారా? బీ కేర్ ఫుల్, ఎంత ప్రమాదమో తెలుసా?

Ice Cream : ప్రాణాంతక కెమికల్స్ ఉపయోగించి ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నాసిరకమైనవి, హానికారక విష రసాయనాలతో చేసినవి, కలుషిత వాతావరణంలో చేసినవి.. మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి.

Ice Cream : ఐస్‌క్రీమ్ తింటున్నారా? బీ కేర్ ఫుల్, ఎంత ప్రమాదమో తెలుసా?

Ice Cream

Ice Cream : ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడని వారుండరు. చిన్న, పెద్ద అనే తేడా లేదు అంతా ఐస్ క్రీమ్ లవర్సే. ఐస్ క్రీమ్ కనిపిస్తే చాలు టేస్ట్ చేయకుండా వదలరు. ఇక సమ్మర్ లో అయితే ఐస్ క్రీమ్ ను మరింత ఇష్టంగా తినేవాళ్లు మరీ ఎక్కువ. లొట్టలేసుకుని మరీ టేస్ట్ చేస్తారు. అయితే, ఐస్ క్రీమ్ లవర్స్ జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం. కోరిమరీ జబ్బులు కొనితెచ్చుకున్నట్లే.

మీరు తింటున్న ఐస్ క్రీమ్ ఒరిజినలో లేక కల్తీదో ఓసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే, మార్కెట్ లో నకిలీ, కల్తీ ఐస్ క్రీమ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. నాసిరకమైనవి, హానికారక విష రసాయనాలతో చేసినవి, కలుషిత వాతావరణంలో చేసినవి.. మార్కెట్ లోకి వచ్చేస్తున్నాయి. కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ దందాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసుల దాడుల్లో ముఠాలు పట్టుబడుతున్నాయి.(Ice Cream)

Also Read..Ice Cream Adulteration : పిల్లలకు ఐస్‌క్రీమ్స్ కొనిస్తున్నారా? అయితే బీ కేర్‌ ఫుల్.. పోలీసుల దాడుల్లో షాకింగ్ నిజాలు

తాజాగా మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. షాపూర్ లో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ గోడౌన్ పై ఎస్ఓటీ పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ దాడుల్లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. ప్రాణాంతక కెమికల్స్ ఉపయోగించి ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిర్వాహకుడు ఫిరోజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.15లక్షల విలువైన ఐస్ క్రీమ్ తయారీ సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అసలే సమ్మర్ కావడంతో ఐస్ క్రీమ్స్ కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు కేటుగాళ్లు రంగంలోకి దిగారు. కాసుల కక్కుర్తితో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కల్తీ ఐస్ క్రీమ్ లు తయారు రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇలాంటి ఐస్ క్రీమ్ లు తింటే జబ్బుల బారిన పడటం ఖాయం. కొన్ని సందర్భాల్లో ప్రాణాలకే ప్రమాదం.(Ice Cream)

తెలంగాణలో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ దందా జోరుగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమార్కులు దర్జాగా వ్యాపారం చేస్తున్నారు. రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇలాంటి ఐస్ క్రీమ్ లు కొని తిన్నవారు అనారోగ్యం బారినపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పిల్లలు కానీ, పెద్దలు కానీ ఐస్ క్రీమ్ తినాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచన చేయాల్సిందే. లేకపోతే ఆరోగ్యానికి శాపంగా మారే ప్రమాదం ఉంది. కల్తీ ఐస్ క్రీమ్ లు తయారు చేసి వాటిని వివిధ బ్రాండ్ల పేరుతో అమ్మేస్తున్నారు.

Also Read..Chocolates : ఈ చాక్లెట్లు తింటే చావే..! హైదరాబాద్‌లో దారుణం.. పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు

ఇటీవలే అమన్ గల్ లో కల్తీ ఐస్ క్రీమ్ తయారీ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. విషపూరిత రంగులు, హానికారక రసాయాలను ఐస్ క్రీమ్ తయారీలో వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫ్యాక్టరీలో అపరిశుభ్ర వాతావరణంలో కలుషిత నీటితో వీటిని తయారు చేస్తున్నారు.(Ice Cream)

ఆ మధ్య వికారాబాద్ జిల్లాలోనూ ఇలాంటి దందానే బయటపడింది. టాస్క్ ఫోర్స్ అధికారులు పరిగి, తాండూర్, వికారాబాద్ లోని ఐస్ క్రీమ్ తయారీ ఫ్యాక్టరీలపై మెరుపు దాడులు చేసి ఐస్ క్రీమ్ తయారీలో విషపూరిత రసాయనాలు వాడుతున్నట్లు కనుగొన్నారు. ఐస్ క్రీమ్స్ తయారీలో కెమికల్స్, సింథటిక్ ఫుడ్ కలర్స్ వాడుతున్నట్లు తెలుసుకున్నారు. ఆకర్షణీయంగా ఉండి మిలమిల మెరిసేందుకు మెటల్ అదే విధంగా ఎలక్ట్రో ప్లేటింగ్ మెటీరియల్ వాడుతున్నట్లుగా గుర్తించారు. ఈ రెండూ.. రక్తనాళాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పరిశోధనలో తేలింది.