వరుస బాంబు పేలుళ్లతో ఆఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ దద్దరిల్లింది. గురువారం(మార్చి-21,2019) ప్రజలందరూ పర్షియన్ కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటున్నసమయంలో ఉగ్రవాదులు జరిగిన వరుస బాంబు పేలుళ్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 23మంది తీవ్ర గాయాలపాలైనట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రతినిధి వహీదుల్లా మయర్ తెలిపారు.
కాబూల్ యూనివర్శిటీ,షియా కర్తే సాఖి ప్రార్థనా మందిరం దగ్గర్లోని మసీదు వాష్ రూమ్ లో,హాస్పిటల్ వెనుక వైపు,ఎలక్ట్రిసిటీ మీటర్ దగ్గర మొత్తం మూడు రిమోట్ కంట్రోల్డ్ ఎక్స్ ప్లోజివ్స్ తో ఉగ్రవాదులు దాడులు తెగబడినట్లు అధికారులు తెలిపారు.యూనివర్శిటీ దగ్గర్లోని ఓ మైన్ ని అధికారులు గుర్తించి నిర్వీర్యం చేశారు.ఇంకా సిటీలో ఎక్కడెక్కడ బాంబులు పెట్టారన్న దానిపై సెర్చింగ్ కొనసాగుతున్నట్లు కాబూల్ పోలీస్ ప్రతినిధి బసిర్ ముజాహిద్ తెలిపారు.
Read Also : న్యూజిలాండ్ లో తుపాకుల అమ్మకాలపై నిషేధం
అయితే ఇప్పటివరకు ఏ ఉగ్రసంస్థ కూడా ఇది తమ పనేనని ప్రకటించుకోలేదు.ఈ వేడుకలు అక్కడి మత సంప్రదాయాలకు వ్యతిరేకమనే భావజాలం కారణంగా ఈ దాడులు జరిగినట్లు సమాచారం. ఈ దాడులకు పాల్పడిన వారిని అరెస్టు చేసినట్లు ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. అక్కడి పరిస్థితులను అదుపులోకి తెచ్చినట్లు చెప్పింది. బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో భద్రతా బలగాలు మోహరించాయి.
సరిగ్గా ఏడాది క్రితం ఇదే ప్రార్థనామందిరం దగ్గర ప్రజలు సెలబ్రేషన్స్ లో పాల్గొన్న సమయంలో ఐఎస్ఐ జరిపిన బాంబు పేలుళ్లలో 33మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సున్నీ మెజారిటీ ఉన్న ఆఫ్గనిస్తాలోని షియా ముస్లింలను టార్గెట్ చేసుకుని ఐసిస్ తరచూ దాడులకు తెగబడుతుంటుంది. గతంలో అనేకసార్లు దాడులకు పాల్పడిన ఐసిస్ గురువారం జరిగిన దాడులకు కూడా పాల్పడి ఉండవచ్చని అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Also : చిత్తుకాగితాలు కాదురా అవి : పాకిస్తాన్ ప్రింటింగ్ ప్రెస్ ల్లో భారత నోట్ల ముద్రణ