మరో గ్రామ వాలంటీర్ ఆత్మహత్య

జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చింది. ప్రజలకు ఇంటికే పథకాలు చేర్చే ఉద్దేశ్యంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. కాగా, ప్రభుత్వం

  • Publish Date - October 21, 2019 / 09:26 AM IST

జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చింది. ప్రజలకు ఇంటికే పథకాలు చేర్చే ఉద్దేశ్యంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. కాగా, ప్రభుత్వం

జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చింది. ప్రజలకు ఇంటికే పథకాలు చేర్చే ఉద్దేశ్యంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. కాగా, ప్రభుత్వం నియమించిన గ్రామ వాలంటీర్ల ఆత్మహత్యలు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. గత నెలలో ఓ మహిళ దురుసుగా మాట్లాడిందన్న కారణంగా పశ్చిమ గోదావరి జిల్లా పండువారి గూడెంకు చెందిన పండు నవీన ఆత్మహత్య చేసుకుంది. రీసెంట్ గా తహసీల్దార్ ఆఫీస్ లో పని చేసే ఉద్యోగి తిట్టి, అవమానించాడని ప్రకాశం జిల్లాలో జుబేదా అనే వాలంటీర్ సూసైడ్ చేసుకుంది. ఈ ఘటనలు మరువక ముందే.. మరో వాలంటీర్ సూసైడ్ చేసుకున్నాడు. 

అప్పుల బాధతో గ్రామ వాలంటీర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలంలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. బొడ్డువానిపాలెం గ్రామానికి చెందిన నూతలపాటి వెంకటకృష్ణ (21) గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. అనారోగ్యంతో ఏడాది క్రితం అతని తండ్రి చనిపోయాడు. తండ్రి ట్రీట్ మెంట్ కోసం అప్పులు చేశాడు. అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో వెంకటకృష్ణ ఒత్తిడికి లోనయ్యాడు. బయటపడే మార్గం లేదని భావించిన అతడు.. ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. వెంకటకృష్ణ ఆత్మహత్యకు అసలు కారణం తెలుసుకునే పనిలో ఉన్నారు. అప్పులే కారణమా లేక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాఫ్తు జరుపుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు