రంగారెడ్డి జిల్లాలో దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి చోరీ చేశారు. ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యాలయం ఎదురుగా ఉన్న ఇండికాష్ ఏటీఎంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు.
రంగారెడ్డి జిల్లాలో దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసి చోరీ చేశారు. బుధవారం (ఆగస్టు 3, 2019)వ తేదీన జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. తుర్కయాంజల్ మున్సిపాలిటీ మన్నెగూడా దగ్గర ఇబ్రహీంపట్నం ఆర్టీఏ కార్యాలయం ఎదురుగా ఉన్న ఇండికాష్ ఏటీఎంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు.
ఏటీఎంను ధ్వంసం చేసి అందులోని డబ్బులు దొంగిలించారు. సమాచారం అందుకున్న ఆధిబట్ల పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న ఆ ఏటీఎంను పరిశీలించారు. అయితే ఎంత మొత్తం చోరీ జరిగిందనే వివరాలను వెల్లడించడం లేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానితులను విచారిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఏటీఎంలో చోరీ కేసులు అధికమయ్యాయి. ఇటీవల రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో దుండగులు ఏటీఎంను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఏటీఎం నుంచి డబ్బులు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు.