Beautician : భర్తతో గొడవపడి బ్యూటీషియన్ ఆత్మహత్య

టెక్కలి ఎన్టీఆర్ కాలనీకి చెందిన కిల్లారి లలిత అనే వివాహిత(35) ఆత్మహత్య చేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం టెక్కలి సంతోషిమాత గుడి ఎదురుగా లలిత బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది

Beautician Commtted Suicide

Beautician : టెక్కలి ఎన్టీఆర్ కాలనీకి చెందిన కిల్లారి లలిత అనే వివాహిత(35) ఆత్మహత్య చేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం టెక్కలి సంతోషిమాత గుడి ఎదురుగా లలిత బ్యూటీపార్లర్ నిర్వహిస్తోంది.   భర్త  దుర్గారావు కొల్ కతాలో పని చేస్తున్నాడు.  కుమార్తెతో కలిసి ఆమె టెక్కలిలో నివసిస్తోంది.

భార్యా భర్తలు ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. గురువారం.. మార్చి 10 కూడా భార్యా భర్తలిద్దరూ గొడవ పడ్డారు.   దీంతో మనస్తాపానికి గురైన లలిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Also Read : Komatireddy Rajagopalreddy: రేవంత్ తో విబేధాలు లేవన్న రాజగోపాల్ రెడ్డి
వెంటనే గమనించిన కూతురు రక్షిత   స్ధానికుల సహాయంతో ఆమెను ఆస్పత్రికి   తరలించింది. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి తల్లితండ్రులు   ఒడిషాలో ఉంటారని వారు వచ్చాక కేసు నమోదు చేస్తామని స్ధానిక ఎస్సై కామేశ్వర రావు తెలిపారు.