Mohammad Sameer : అమెజాన్ మేనేజర్ హత్య వెనుక 18 ఏళ్ల యువకుడి ‘మాయ గ్యాంగ్’, నూనూగు మీసాల వయస్సులోనే హత్యలు, దోపిడీలు

18 ఏళ్లకే నాలుగు హత్యలు, దోపిడీలు.. తుపాకులతో కాల్పులు. ఇదీ టీనేజ్ కుర్రాళ్ల దందా. వారి అరాచకాలకు ఎంతోమంది బలైపోయారు. బెదిరిస్తారు అందినకాడికి దోచుకుంటారు. ప్రతిఘటిస్తే తుపాకితో కాల్చేస్తారు. 18 ఏళ్లకే జైలు..జీవితం అంటే లెక్కలేని తనం. స్మశానవాటిక నా చిరునామా, ఇది జీవించే వయస్సు, కానీ నేను చనిపోవాలనుకుంటున్నాను అంటూ డైలాగులు.

Amazon Manager Harpreet Gill Case

Amazon Manager Harpreet Gill Case : అమెజాన్ మేనేజర్ హర్‌ప్రీత్‌ గిల్‌ హత్య వెనుక ఓ 18 ఏళ్ల నూనూగు మీసాల యువకుడు గ్యాంగ్ ఉన్నట్లుగా తేలింది. హర్‌ప్రీత్‌ గిల్‌ను హత్య చేసింది 18 ఏళ్ల యువకుడి నాయకత్వంలోని ‘మాయా గ్యాంగ్’ అని పోలీసులు గుర్తించారు. ఈ యువకుడి పేరు మహ్మద్ సమీర్ (Mohammad Sameer) అలియాస్ మాయ. ఇప్పటికే పలు కేసుల్లో నేరస్థుడుగా ఉన్నాడని గుర్తించారు. నాలుగు మర్డర్ కేసుల్లో బాల నేరస్థుడిగా శిక్ష కూడా అనుభవిస్తున్నాడు. ఈ 18 ఏళ్ల కుర్రాడు అమెజాన్ మేనేజర్ హర్‌ప్రీత్‌ను హత్యచేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.

అతని ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తుపాకీలకు పోజులిస్తూ, తుపాకులతో షూట్ చేస్తున్నట్లు ఫోటోలు ఉన్నాయి. తుపాకులతో పలు పోజుల్లో రీల్స్ఉన్నాయి. ఇన్ స్టాలో అతనికి 2000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. పొడవాటి జుట్టుతో రెండు చేతుల్లో తుపాకులు పట్టుకుని పోజులిచ్చిన ఫోటోలు, జైలు,‘మాయా గ్యాంగ్’ పేరుతో ఉన్న రీల్ లో దాదాపు 12 మంది యువకులున్నారు. సమీర్ ఇన్ స్టా బయోలో “నేను అపఖ్యాతి పాలయ్యాను, స్మశానవాటిక నా చిరునామా, ఇది జీవించే వయస్సు, కానీ నేను చనిపోవాలనుకుంటున్నాను” అని ఉంది.

Uttar Pradesh : నమాజ్ కోసం బస్ ఆపిన కండక్టర్‌ను ఉద్యోగం నుంచి తొలగించిన ప్రభుత్వం .. మనస్తాపంతో ఆత్మహత్య

హర్‌ప్రీత్‌ గిల్‌ హత్య కేసులో సమీర్‌, మరో కుర్రాడు 18 ఏళ్ల బిలాల్ గనిలను పోలీసులు అరెస్ట్ చేశారు. బిలాల్ గని 2022లో హత్య, దోపిడీ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతడిని అరెస్ట్ చేసి చిల్డ్రన్స్ అబ్జర్వేషన్ హోమ్‌కు తరలించారు. కానీ బయటకు వచ్చి ఓ వెల్డింగ్ షాప్‌లో పని చేస్తున్నాడు.

ఢిల్లీకి చెందిన హర్‌ప్రీత్‌ గిల్‌ అనే 36 ఏళ్ల వ్యక్తి అమెజాన్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి 11.30 గంటల సమయంలో తన మేనమామ గోవింద్‌ కలిసి సుభాష్‌ విహార్‌లోని ఇరుకైన సందులో బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో వారికి బైక్ మీద వచ్చిన కొంతమంది యువకులు ఎదురయ్యారు. వారు వెళ్లే సందు ఇరుకుగా ఉండటంతో ఇరువురికి మధ్యా గొడవ జరిగింది. దీంతో సమీర్ గ్యాంగ్ కాల్పులు జరిపారు. తరువాత అక్కడి నుంచి పారిపోయారు. ఈ కాల్పుల్లో ఇద్దరు గాయపడ్డారు. తుపాకుల కాల్పులు శబ్ధం విన్న స్థానికులు వచ్చి చూడగా గాయాలతో పడి ఉన్న వారిద్దరిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

కానీ తీవ్ర గాయాలతో హర్‌ప్రీత్‌ గిల్ అప్పటికే మరణించాడని డాక్టర్లు తెలిపారు. అతని మేనమామ గోవింద్‌కు చికిత్సనందించారు. చికిత్స పొందుతు గోవింద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేయగా సదరు నిందితుల్ని గుర్తించారు. సమీర్, బిలాల్ గనిలను అరెస్ట్ చేశారు. మిగిలినవారి గురించి గాలిస్తున్నారు.

Drug Case : డ్రగ్స్ కేసులో ముగ్గురు నిందితులు అరెస్ట్, రిమాండ్ కు తరలింపు

18 ఏళ్లకే సమీర్ కు నేర చరిత్ర ఉందని నగరంలో పెద్ద డాన్ కావాలనే కోరికతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయుధాలతో ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తుంటారని పోలీసు అధికారులు తెలిపారు. అలాగే సమీర్ గ్యాంగ్ లో ఉన్న బిలాల్‌కు నేరాలు చేయడం కొత్తేమీ కాదని తెలిపారు. అనుచరులు కలిసి 2022లో భజన్‌పురాలో ఒక హత్య, ఒక వ్యక్తి నుండి స్కూటీని దోచుకున్న కేసుతో సహా రెండు కేసులలో ఉన్నాయని తెలిపారు. అతను మైనర్‌గా కాబట్టి చిల్డ్రన్ అబ్జర్వేషన్ హోమ్ కు తరలించామని కానీ కొన్ని రోజుల్లోనే బయటకొచ్చాడని తెలిపారు.