పిల్లలు చెడు బాట పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. వారి మంచి మార్గంలో వెళ్లేలా తల్లిదండ్రులు చూడాలి. పిల్లల భవిష్యత్తు పేరెంట్స్ పైనే ఉంటుంది. ఎంతో బాధ్యతగా
పిల్లలు చెడు బాట పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. వారి మంచి మార్గంలో వెళ్లేలా తల్లిదండ్రులు చూడాలి. పిల్లల భవిష్యత్తు పేరెంట్స్ పైనే ఉంటుంది. ఎంతో బాధ్యతగా వ్యవహరించాల్సిన తండ్రే.. దారి తప్పాడు. కూతురితో ఏ తండ్రీ చేయని పని చేశాడు. భార్య మీద కోపంతో కూతురితో మద్యం తాగించి తన శాడిజం చూపించాడు.
వివరాల్లోకి వెళితే.. భార్యపై కోపంతో మూడేళ్ల కూతురితో మద్యం తాగించి, దాన్ని వీడియో తీసి భార్యకు పంపాడో భర్త. బెంగళూరు మాగడిరోడ్డు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ నీచుడి పేరు కుమరేష్. ఓ యువతి ప్రేమించి పెళ్లి చేసుకుంది. కుమరేష్ రౌడీషీటర్ అనే విషయం పెళ్లి తర్వాత తెలిసింది. అంతలో వీరికి ఓ పాప పుట్టింది. కుమారేష్ తరచూ భార్యతో గొడవపడుతున్నాడు. ఇటీవల పాపను బలవంతంగా బయటకు తీసుకెళ్లిన అతడు.. స్నేహితులతో కలిసి మద్యం తాగుతూ పక్కనే ఉన్న పాపకీ ఇచ్చాడు. ఓ గ్లాస్ లో విస్కీ పోసి పాపతో తాగించాడు. నువ్వు ఇది తాగితే.. నిన్ను బైక్ మీద తిప్పుతానని పాపతో చెప్పాడు. అభంశుభం తెలియని ఆ చిన్నారి.. బైక్ మీద తిప్పుతానని తండ్రి చెప్పడంతో.. అతడిని నమ్మింది. ఆ నీచుడు చెప్పినట్టే గ్లాస్ లో ఉన్న విస్కీ తాగింది.
పాపతో విస్కీ తాగించడమే కాదు.. దాన్ని వీడియో తీసి భార్య ఫోన్ కు పంపాడు ఆ నీచుడు. ఆ వీడియో చూసి భార్య కంగుతింది. భర్త వికృత చేష్టలకు షాక్ అయ్యింది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. భర్త పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తన కోసం గాలిస్తున్నారనే విషయం తెలిసిన వెంటనే కుమరేష్ తన కూతురిని తీసుకుని పారిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. కుమరేష్ కోసం గాలిస్తున్నారు. తన భర్తను కఠినంగా శిక్షించాలని ఆమె పోలీసులను కోరింది.
ఆ తండ్రి చేసిన వెధవ పనిపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. నువ్వసలు తండ్రేనా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే.. ఇంతటి దారుణానికి ఒడిగట్టడం పట్ల మండిపడుతున్నారు. భార్య మీద కోపం చిన్నారి మీద ఈ విధంగా చూపిస్తావా..నువ్వసలు మనిషివేనా అని తిట్టిపోస్తున్నారు. వెంటనే ఆ నీచుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.