LPG cylinder గొడవలో భర్తను కొట్టి చంపిన భార్య

  • Publish Date - May 16, 2020 / 11:19 AM IST

45 సంవత్సరాల వయస్సున్న భవన కార్మికుడికి అతని భార్యకు మధ్య గ్యాస్ సిలిండర్ విషయంలో జరిగిన గొడవలో భర్త చనిపోయాడు. హనుమంత్ నగర్ పోలీసులు భార్య ఆశ(35)పై కేసు నమోదు చేశారు. కలాబురాగి జిల్లాలోని చిట్టాపూర్ లో ఉండే ఉమేశ్ అతని భార్య ఆశ ఉంటున్నారు. 

భవన నిర్మాణ కార్మికులుగా గత 12ఏళ్లుగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం ఉదయం ఆశ భర్తకు రూ.500 ఇచ్చింది. గ్యాస్ సిలిండర్ ఖాళీ అయిందని నింపుకు రమ్మని చెప్పింది. రాత్రి 9గంటల సమయంలో ఇంటికి వచ్చిన ఉమేశ్.. భార్యపై దాడికి దిగాడు. చెక్క దుంగ తీసుకుని దాడి చేశాడు. 

ఉమేశ్ నుంచి దుంగను లాక్కునేందుకు ప్రయత్నించింది భార్య. ఆ ప్రయత్నంలో లాక్కుంటూనే భర్తను తలపై గట్టిగా బాదింది. అపస్మారక స్థితికి చేరుకున్న ఉమేశ్‌ను భార్య పట్టించుకోలేదు. మందు మత్తులో పడిపోయాడనుకుని వదిలేసింది. ఆ రోజంతా అలా వదిలేసి తెల్లారి లేవకపోతుండటంతో చనిపోయినట్లగా కన్ఫామ్ చేసుకుంది. 

స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆశపై హనుమంత్ నగర్ పోలీసులు సెక్షన్ 304ప్రకారం.. కేసు ఫైల్ చేశారు. ఘటనపై పూర్తి సమాచారం సేకరించి విచారణ జరుపుతున్నామని పోలీసులు చెప్పారు. 

Read Here>> గాలివాన బీభత్సం..టోల్ గేట్ షెడ్ కూలి దంపతుల మృతి