5ఏళ్ల కొడుకును చంపేసి తల్లిపై ఏడుగురు అత్యాచారం..ఇద్దరినీ తాడు కట్టేసి నీళ్లలో పడేసారు..

  • Publish Date - October 13, 2020 / 12:52 PM IST

Bihar Mother gang rape 5 years son dead : ఐదేళ్ల కొడుకు తన తల్లిని కొంతమంది ఏదో చేస్తున్నారని తెలుసుకున్న ఆ పసివాడు ఆ దుర్మార్గులకు అడ్డుపడ్డాడు. కానీ జాలీ..దయా అనే మాటలకు కనీసం మానవత్వం అనే మాటలకు అర్థం కూడా తెలియని ఏడురుగురు కామాంధులు ఆ పసివాడిని దారుణంగా కొట్టి పడేసి..తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత ఆ తల్లీ బిడ్డల్ని తాడుతో కట్టేసి కాలువలో పడేశారు. ఈ అత్యంత దారుణ ఘటన బీహార్ లో శనివారం (October 10,2020) చోటుచేసుకోగా ఆదివారం వెలుగులోకి వచ్చింది.


బక్సర్ జిల్లాలోని చెయ్‌గైన్‌ లోని ఓ గ్రామానికి చెందిన 35ఏళ్ల మహిళ బ్యాంకులో నగదు డిపాజిట్ చేయడానికి తన 5ఏళ్ల కొడుకుతో మండల కేంద్రానికి వెళ్ళింది. ఆమెపై ఏడుగురు కామాంధుల కన్ను పడింది. ఆమెను కిడ్నాప్ చేసి ఊరి చివరికి తీసుకెళ్లి అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాలపడ్డారు. వారి చేసే దారుణమైన చేష్టలకు ఆమె పెద్ద పెద్దగా బాధతో అరుస్తోంది.


దీంతో అమ్మను వాళ్లు ఏదో చేస్తున్నారని ఆ ఐదేళ్ల పసివాడు అమ్మా అమ్మా అని ఏడుస్తూ వారిని అడ్డుకోవటానికి తన చిట్టి చేతులతో యత్నించాడు. దీంతో అత్యాచారానికి అడ్డు వస్తున్న ఆ పసివాడిని దారుణంగా కొట్టిపడేశారు. ఓ పక్క తన బిడ్డను దారుణంగా కొట్టటం మరోపక్క తనపై జరిగే పాశవిక అత్యాచారానికి ఆ తల్లి రోధిస్తూ వారిని వేడుకున్నాడు ఆ కామాంధులు కనికరించలేదు. వారి కామవాంఛ తీర్చుకున్నారా ఏడుగురు నరరూప రాక్షసులు..నీటి ప్రవాహంలో పడేశారు.



https://10tv.in/madhyapradesh-police-welcomes-an-accused-with-a-garland/
అలా నీటి ప్రవాహంలో కొట్టుకపోతున్న తల్లీకొడుకులు చూసిన స్థానికులు వారిని బైటకు తీసి చెయ్‌గైన్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కానీ అప్పటికే పిల్లాడు చనిపోయాడని డాక్టర్లు తెలిపారు.


బాధితురాలి పరిస్థితి మాత్రం విషమంగా ఉండడంతో ఆమెను మెరుగైన సదార్ ఆస్పత్రికి తరలించారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. ఈ ఘటనపై బాధితురాలి భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందుతుల కోసం గాలిస్తున్నారు. దీంట్లో భాగంగా.. నిందితుల్లో ఒకడైన మున్నీరామ్‌ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మిగతావారి కోసం గాలిస్తున్నారు.