BRS Leader Dead: బీఆర్ఎస్ నేత దారుణ హత్య.. మందు పార్టీ పేరుతో పిలిచి ముక్కలుగా..

దీని వెనుకున్నది ఎవరైనా పట్టుకుంటాం. నేరస్తులకు శిక్ష పడేలా చూస్తాం. ఈ కేసులో నిందితులకు ఉరిశిక్ష కానీ జీవిత ఖైదు పడేలా చూస్తాం.

  • Published on- May 23, 2026 / 07:24 PM IST

BRS Leader Dead: సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ నేత మధు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. మధును హత్య చేసిన ఇంటిని పోలీసులు గుర్తించారు. తాళ్లగడ్డలోని తాటిపాముల జానయ్య ఇంట్లో నిందితులు మద్యం సిట్టింగ్ వేసి హత్యకు స్కెచ్ వేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్లాన్ ప్రకారమే మర్డర్ చేసినట్లుగా తెలిపారు. ఘటనా స్థలంలో రక్తం, కత్తివేటుకు తెగిపడిన శరీర భాగాలను గుర్తించారు. మధుని హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని ఏర్కారం స్టేజ్ దగ్గర పడేసినట్లు గుర్తించారు. హత్య జరిగిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ నరసింహ పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

”తెలిసిన వాళ్లే పిలిపించి అక్కడ హతమార్చారు. మధుకి తెలిసిన వాళ్లు పాత పగలు ఉన్న వ్యక్తులతో కుమ్మక్కై చేసినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నాం. దీని వెనుకున్నది ఎవరైనా పట్టుకుంటాం. నేరస్తులకు శిక్ష పడేలా చూస్తాం. ఈ కేసులో నిందితులకు ఉరిశిక్ష కానీ జీవిత ఖైదు పడేలా చూస్తాం” అని జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు.

”మధు కుటుంబసభ్యులను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పరామర్శించారు. మధుది ప్రభుత్వ హత్యే అని ఆయన ఆరోపించారు. మాట్లాడటానికి పిలిపించి మర్డర్ చేశారని చెప్పారు. పోలీస్ అధికారులు నిందితులను కాపాడే ప్రయత్నం చేయొద్దు. తప్పు చేసిన అధికారులను గుర్తు పెట్టుకుంటాం. వారు తప్పించుకోలేరు. నిందితులను రక్షించే ప్రయత్నంలో మీరు జైల్లో పడే పరిస్థితి తెచ్చుకోవద్దు. కొంతమంది అధికారులు బాగా అవినీతికి అలవాటు పడ్డారు. ఈ కేసు విచారణలో ఎక్కడ తప్పు జరిగినా వాళ్లందరూ బాధ్యులు అవుతారు. రేపు తప్పకుండా వారికి శిక్ష పడుతుంది” అని మాజీమంత్రి జగదీశ్ రెడ్డి హెచ్చరించారు.

Also Read: హైదరాబాద్‌లో దారుణ ఘటన.. న్యాయవాదిని కారుతో ఢీకొట్టిన దుండగులు..