Prakasam District : ప్రకాశం జిల్లాలో మాచర్ల విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం

ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఒకవిద్యార్ధిని  ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తన మానసిక పరిస్ధితి సరిగా   లేనందున తల్లితండ్రులకు భారం కాకుడదని  భావించిన విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం   చేసింది. సమయానికి పోలీసులు స్పందించి ఆమెను  ప్రాణాపాయం నుంచి కాపాడారు.

bsc girl student

Prakasam District :  ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఒకవిద్యార్ధిని  ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. తన మానసిక పరిస్ధితి సరిగా   లేనందున తల్లితండ్రులకు భారం కాకుడదని  భావించిన విద్యార్ధిని ఆత్మహత్యాయత్నం   చేసింది. సమయానికి పోలీసులు స్పందించి ఆమెను  ప్రాణాపాయం నుంచి కాపాడారు.

పల్నాడు జిల్లా మాచర్లకు  చెందిన  విద్యార్ధిని. ప్రకాశం జిల్లాలోని సీఎస్ పురంలో అగ్రికల్చరల్ బీఎస్సీ చదువుతోంది.   థర్డ్ ఇయర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అయిపోవటంతో కాలేజీకి  సెలవులు ఇచ్చారు. ఇంటికి వెళ్లాల్సిన విద్యార్ధిని ఇంటికి వెళ్లకుండా మార్కాపురంలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో బసచేసింది.

నాలుగు పేజీల లేఖ రాసి స్వగ్రామం మాచర్లలో నివసిస్తున్న తన తండ్రికి వాట్సప్ ద్వారా ఫోటో తీసి పంపించింది. అనంతరం బ్లేడు తో చేయి కోసుకుంది.  తన కూతురు పంపిన లేఖ చూసిన తండ్రి అప్రమత్తమై   మార్కాపురం పోలీసులకు సమాచారం అందించారు.
Also  Read : Elon Musk: ఒకప్పుడు కోకాకోలాలో కొకైన్ ఉండేదా?.. ఎలన్ మస్క్ ఏమన్నాడంటే..
పోలీసులు లాడ్జి వద్దకు చేరుకునే సరికి రక్తపు మడుగులో ప్రాణాపాయ స్ధితిలో ఉన్న విద్యార్ధినిని వెంటనే మార్కూపురం ప్రభుత్వ  వైద్యశాలకు తరలించారు. వైద్యులు ఆమెకు   చికిత్స అందిస్తున్నారు.