ఏం జరిగింది : బీటెక్ అమ్మాయి ఆత్మహత్య

నగరంలో విషాదం నెలకొంది. చికడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భవనంపై నుంచి దూకి బి టెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

  • Publish Date - March 29, 2019 / 01:41 PM IST

నగరంలో విషాదం నెలకొంది. చికడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భవనంపై నుంచి దూకి బి టెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.

హైదరాబాద్ : నగరంలో విషాదం నెలకొంది. చికడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భవనంపై నుంచి దూకి బి టెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం బృందావన్ కాలనీలో తల్లిదండ్రులతో కలిసి సుస్మిత నివాసముంటుంది. ఘట్ కేసర్ ACE కాలేజ్ లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇటీవల కాలేజీ యాజమాన్యం సుష్మిత ను ఫీజు చెల్లించాలని అడిగింది. అయితే ఫీజు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పకుండా తనలో తనే మదన పడింది.
Read Also : లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ రివ్యూ

ఫీజు కోసం కాలేజ్ సిబ్బంది సుస్మిత తండ్రి రాజేంద్రప్రసాద్ కు ఫోన్ కాల్ చేసింది. ఫీజు విషయం ముందే ఎందుకు చెప్పలేదని సుస్మితను తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనోవేదనకు గురైన సుస్మిత.. తను నివాసం ఉంటున్న మూడో అంతస్తుపై నుంచి కిందికి దూకింది. తీవ్రగాయాలైన ఆమెను నల్లకుంటలోని దుర్గా భాయ్ దేశ్ ముఖ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది.

కాలేజీ ఫీజు కోసం మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే ఫీజు విషయం కారణంగా ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని బందువులు అంటున్నారు. సుస్మిత తల్లిదండ్రులు ఆర్థికంగా బాగానే ఉన్నారని బంధువులు, స్నేహితులు చెబుతున్నారు. చిక్కడపల్లి పోలీసు స్టేషన్ లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
Read Also : గుండెలు అదిరాయి : డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరణ శిక్ష