Extra Marital Affair : భార్య ఆధార్ కార్డుతో ప్రియురాలితో హోటల్‌లో గడిపిన వ్యక్తిపై కేసు
వివాహేతర సంబంధాలు మెయింటెయిన్ చేయటం కోసం మగవారు ఎన్నెన్నో తప్పులు చేస్తూ ఉంటారు. అలా ఓ భర్త చేసిన తప్పును భార్య పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భర్త, అతని ప్రియురాలు ప
- chvmurthy
- Published On : February 5, 2022 / 02:06 PM IST
Extra marital Affair
Extra Marital Affair : వివాహేతర సంబంధాలు మెయింటెయిన్ చేయటం కోసం మగవారు ఎన్నెన్నో తప్పులు చేస్తూ ఉంటారు. అలా ఓ భర్త చేసిన తప్పును భార్య పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో భర్త, అతని ప్రియురాలు పరారీలో ఉన్నారు.
గుజరాత్ కు చెందిన 41 ఏళ్ల వ్యక్తి వ్యాపారవేత్త. అతని భార్య కూడా అదే కంపెనీలో డైరెక్టర్ గా పని చేస్తోంది. భర్త కొన్నాళ్లుగా వ్యాపారం నిమిత్తం వివిధ ప్రాంతాలకు టూర్లకు వెళ్ళటం ఎక్కువయ్యింది. ఎందుకో ఆమె మనసు కీడు శంకించింది. భర్త తనను మోసం చేస్తున్నాడని గ్రహించింది.
భర్తకు తెలియకుండా అతని కారులో జీపీఎస్ పరికరాన్ని అమర్చింది. అతను ఎక్కడెక్కడకు వెళుతున్నాడో తెలుసుకుని నోట్ చేసుకోవటం మొదలు పెట్టింది. గతేడాది అతను వ్యాపారం నిమిత్తం బెంగుళూరు వెళుతున్నానని చెప్పి గుజరాత్ నుంచి బయలుదేరి వెళ్ళాడు. కానీ ఆ కారు బెంగుళూరు కాకుండా మహారాష్ట్ర లోని పూణేకి వెళ్లింది.
అక్కడ ఒక హోటల్ కు చేరుకుంది. అనంతరం భర్త తిరిగి వచ్చేశాక ఆమె పూణే లోని హోటల్ కు వెళ్లి భర్త హోటల్ లో దిగిన వివరాలు అడిగి తెలుసుకుంది. హోటల్ లో తన ఆధార్ కార్డుతో భర్త వేరే మహిళతో దిగినట్లు తెలుసుకుంది. సీసీటీవీ ఫుటేజి తెప్పించి పరిశీలించగా తన భర్త వేరే మహిళతో హోటల్ కు వచ్చాడని నిర్ధారించుకుంది.
Also Read : Double Murder Case : టంగుటూరు జంట హత్యల కేసులో నిందితులు గుర్తింపు
ఈ ఆధారాలతో ఫిబ్రవరి 1 మంగళవారం పూణేలోని హింజేవాడి పోలీసు స్టేషన్ లో తన భర్త, అతని ప్రియురాలిపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త కోసం ప్రయత్నించగా అతను ప్రియురాలితో కలిసి పరారయ్యాడు. వారిద్దరిపై ఐపీసీ సెక్షన్ 419 కింద కేసు నమోదు చేసి వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.
