ప్రయాణికుడిని చావబాది డబ్బు, బంగారంతో క్యాబ్ డ్రైవర్ పరారీ

శంషాబాద్ లో దారుణం జరిగింది. క్యాబ్ డ్రైవర్ దారుణానికి ఒడిగట్టాడు. ప్రయాణికుడిని చితక్కొట్టి అతడి నుంచి డబ్బు(యూకే కరెన్సీ), బంగారం లాక్కుని పారిపోయాడు. శంషాబాద్

  • Publish Date - September 4, 2019 / 06:53 AM IST

శంషాబాద్ లో దారుణం జరిగింది. క్యాబ్ డ్రైవర్ దారుణానికి ఒడిగట్టాడు. ప్రయాణికుడిని చితక్కొట్టి అతడి నుంచి డబ్బు(యూకే కరెన్సీ), బంగారం లాక్కుని పారిపోయాడు. శంషాబాద్

శంషాబాద్ లో దారుణం జరిగింది. క్యాబ్ డ్రైవర్ దారుణానికి ఒడిగట్టాడు. ప్రయాణికుడిని చితక్కొట్టి అతడి నుంచి డబ్బు(యూకే కరెన్సీ), బంగారం లాక్కుని పారిపోయాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి క్యాబ్‌లో వస్తుండగా ఈ ఘటన జరిగింది. యూకే నుంచి వచ్చిన ప్రయాణికుడు.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌ నుంచి ఓ ప్రైవేట్ క్యాబ్‌లో వస్తుండగా క్యాబ్ డ్రైవర్ దారి మళ్ళించి గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ప్రయాణికుడిపై దాడి చేశాడు. అతడి నుంచి 2 లక్షల యూకే కరెన్సీ, బంగారాన్ని ఎత్తుకెళ్లాడు.
 
బాధితుడు తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి జరిగింది చెప్పాడు. తాను గుర్తు తెలియని ప్రదేశంలో ఉన్నానని.. తానున్న ప్రదేశంలో కొండపై గుడి ఉన్నట్లు వెల్లడించాడు. వెంటనే బాధితుడి బందువులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి స్వగ్రామం దమ్మాయిగూడ. 15 రోజుల్లో తన వివాహం ఉండటంతో బాధితుడు యూకే నుంచి ఇండియాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఎయిర్ పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్యాబ్ డ్రైవర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన సంచలనం రేపింది. చాలామంది నగరవాసులు క్యాబ్ లను ఆశ్రయిస్తున్నారు. ఓలా, ఉబెర్ క్యాబుల్లో జర్నీ చేస్తున్నారు. ఈ ఉదంతంతో వారంతా హడలిపోతున్నారు. సేఫ్ గా ఉంటుందని భావించిన క్యాబ్ లను ఆశ్రయిస్తున్నారు. అలాంటిది క్యాబ్ డ్రైవరే దారుణానికి ఒడిగట్టడం షాక్ కు గురి చేసింది.