ప్రేమ పేరుతో వివాహితపై వల… గర్భవతిని చేసి…

  • Publish Date - April 14, 2020 / 01:07 PM IST

భర్తతో విబేధాలు వచ్చి  పుట్టింట్లో ఉన్న యువతిని మాయ మాటలతో లోబరుచుకుని గర్భవతిని చేసిన ప్రబుధ్ధుడి ఉదంతం మెదక్ జిల్లాలో వెలుగు చూసింది.  మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువతికి (19) గతేడాది వివాహం అయ్యింది. పెళ్లైన కొన్నాళ్లకే  భార్యా, భర్తల మధ్య మనస్పర్ధలు రావటంతో ఆమె పుట్టింటికి తిరిగి వచ్చింది.  

ఈక్రమంలో ఆమెకు బావ వరుస అయ్యే నర్సింహ అనే వ్యక్తి ఆ యువతికి ప్రేమ పేరుతో  దగ్గరయ్యాడు.  పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి ఆమెను శారీరకంగా లొంగదీసుకున్నాడు. అతడిని నమ్మిన ఆ యువతి అతనికి అనుకూలంగా నడుచుకుంది. తరచూ ఆ యువతితో నర్సింహ తన లైంగిక కోరికలు తీర్చుకోనేవాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. 

దీంతో ఆమె పెళ్లి చేసుకోవాలని నర్సింహను కోరగా… తనకేమీ సంబంధం లేదని ఎదురు తిరిగాడు. ఎవరి వల్లో గర్భం తెచ్చుకుని తనను ఇరికించాలని చూస్తున్నావా ?  అంటూ ఆమెపై నిందలు మోపి తప్పించుకున్నాడు.  నర్సింహ వ్యవహారంతో మోసపోయానని గ్రహించిన యువతి ఆదివారం ఏప్రిల్12న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Also Read | డాక్టర్ల అల్ప సంతోషం.. పెళ్లి బట్టలకు బదులు చెత్త సంచులతో