Contenttribal Family Committed Suicide Along Their Two Kids 229
విశాఖపట్నం కె.కోటపాడు మండలం చంద్రయ్యపేటలో ఆదివారం విషాదం చోటు చేసుకొంది. గిరిజన వ్యక్తి సహా ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు వారి తండ్రి అక్కడికక్కడే మృతి చెందారు, వారి తల్లి పరిస్థితి తీవ్రంగా ఉందని చెబుతున్నారు.
విశాఖపట్నం కె.కోటపాడు మండలం చంద్రయ్యపేటలో ఆదివారం విషాదం చోటు చేసుకొంది. గిరిజన వ్యక్తి సహా ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు వారి తండ్రి అక్కడికక్కడే మృతి చెందారు, వారి తల్లి పరిస్థితి తీవ్రంగా ఉందని చెబుతున్నారు. ఆ కుటుంబానికి ఏ కష్టమొచ్చిందో తెలియడం లేదు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తిరిగిరాని లోకాలకు చేరారు. భార్యా భర్తల మధ్య చిన్న చిన్నగొడవల కారణంగా ఒకరిపై ఒకరు పంతానికి పోయి పురుగుమందు తాగి.. పిల్లలచేత తాగించి ఆత్మహత్యకు పాల్పడ్డారా..? ఆర్థిక సమస్యలా,ఇంకా ఏమైన సమస్యలా అనే విషయం అంతుచిక్కటం లేదు.ఆమె కోలుకుంటేనే అసలు విషయం వెలుగులోకి వస్తుందంటున్నరు. ఈ నలుగురు సభ్యులు ఆదివారం విశాఖపట్నం జిల్లాలో కె.కోటపాడు మండలం, చంద్రయ్యపాలం గ్రామం వద్ద పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
దీంతో పాటు పిల్లల చదువు విషయంలో దంపతులు తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలో రోజూ లాగానే శనివారం రాత్రి అంతా కలిసి భోజనం చేసి నిద్రపోయారు. ఆదివారం ఉదయం వారు కోళ్లఫారంలో లేకపోవడాన్ని గమనించిన కన్నంనాయుడు వారుంటున్న గది వద్దకు వెళ్లి పిలిచాడు. ఎంతకీ తలుపు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా చిన్నారావు(30), ఆయన కుమారుడు సిద్ధు(6), కుమార్తె దీనా(3)లు మృతిచెంది ఉన్నారు. ప్రాణాపాయ స్థితిలో భార్య లక్ష్మి(25)కొట్టుమిట్టాడుతోంది. తలుపులను పగలుగొట్టి లక్ష్మిని పడకల ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ప్రాథమిక వైద్యం అందించాక విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కె.కోటపాడు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే చోడవరం సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్.ఐ ఎం.వీ.రమణలు సంఘటన స్ధలానికి చేరుకుని వారుంటున్న గదిని పరిశీలించారు.పురుగు మందు అనవాళ్లు ఎం కనిపించలేదు. మృతుల నోటి నుంచి ఎటువంటి నురగలు రాకపోవడంతో. దీనిపై చోడవరం సీఐ మాట్లాడుతూ విషం తీసుకోవడం లేదా విషాహారం తినడం వల్లే చనిపోయి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. శనివారం రాత్రి వారు తిన్న
ఆహరంతో పాటు నీటిని ల్యాబ్ పరీక్షలకు పంపుతున్నామన్నారు.సీఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
లక్ష్మి పరిస్థితి విషమం:
విశాఖ కేజీహెచ్ హాస్పత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఆమెను అత్యవసర వైద్య విభాగంలో చేర్చి సేవలు అందిస్తున్నారు. ఇరవై నాలుగు గంటలు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేమని వైద్యాధికారులంటున్నారు.