ఆస్తికోసం కన్న తల్లినే హత్యచేసిన ఉదంతం గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. ఆస్తి వేరేవారికి రాస్తుందేమో అనే భావనతో కన్న తల్లి అనే కనికరం లేకుండా భర్త , బావతో కలిసి హత్యకు పాల్పడి బంగారం డబ్బును నగలను దోచుకెళ్ళింది ఓ కన్న కూతురు. దొరికి పోతామోనని భయంతో వచ్చి లొంగి పోయింది. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ సంఘటన గుంటూరులోని నగరం పాలెం లో జరిగింది.
నగరంపాలెం లోని మూడు బొమ్మల సెంటర్ లో ఆలపాటి లక్ష్మీ నివాసం ఉంటుంది. స్థానికంగా వున్న కూరగాయల మార్కెట్ లో కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. లక్ష్మి కి ఇద్దరు పిల్లలు, భర్త రమేష్ మూడు సంవత్సరాల క్రితం చనిపోగా, కుమారుడు హేమంత క్రిష్ణ పదమూడు సంవత్సారాల క్రితం ఆత్మహత్య చేసుకుని కన్ను మూశాడు. కుమార్తె బార్గవికి అచ్చంపేట వాసి అయిన రామాంజనేయులతో వివాహం అయింది. తండ్రి చనిపోవడంతో తల్లి ఆలపాటి లక్ష్మి వేరొకరి తో చనువుగా వుంటోందని భార్గవి అనుమానపడుతూ వుండేది.
గతంలోను అస్తికోసం తగాదాలు అవుతూ వుండటంతో లక్ష్మి ఒంటరిగా ఉంటోంది. ఈ పరిస్థితుల్లో ఆస్తి, బంగారం తమకు దక్కదు అని అక్కసు పెంచుకుంది కూతురు భార్గవి. దీనికోసం తన భర్త, వివాహేతర సంభందం వున్న తన బావతో కలిసి మర్డర్ చేసేందుకు ప్లాన్ చేసింది. మర్డర్ చేసిన తరువాత బంగారం, వచ్చే ఆస్తిని ముగ్గురు సమాన భాగాలు పంచుకోవాలని నిర్ణయించుకొన్నారు. పదకం లో భాగంగా అక్టోబరు 10వ తేదీన భార్గవి,వెంకట శివరావు లు ఇద్దరు అచ్చంపేట నుండి గుంటూరు వచ్చారు. రాత్రి పదిగంటల సమయంలో లక్ష్మిని గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. హత్య అనంతరం బీరువాలోని నగలు, బంగారం, డబ్బును తీసుకోని పారిపోయారు.వెళుతు వెళూతూ మ్రుతురాలి సెల్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసి రోడ్డు పక్కన పడవేసి వెళ్లిపోయారు. తరువాత ఏమి తెలియనట్లుగా దోపిడి దొంగలు హత్యచేసినట్లుగా అందరిని నమ్మించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్గవి పై అనుమానం వ్యక్తంచేయడంతో హత్య చేసిన ముగ్గురు కొంతకాలం కనిపించకుండా పారిపోయారు. పోలీసులు తమకోసం గాలిస్తున్నారని తెలియడంతో స్థానిక విఆర్.వో. మధ్యవర్తుల సమక్షంలో వచ్చి లొంగి పోయారు. నిందితుల వద్దనుండి బంగారపు చైన్, ఏడువేల రూపాయలు నగదు , సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.