Dead Body
Kukatpally: ట్యాంక్ బండ్ వద్ద చిల్డ్రన్ పార్క్ లోకి డెడ్ బాడీ కొట్టుకురావడంతో కలకలం మొదలైంది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనాస్థలానికి వచ్చి విచారణ జరిపారు. కూకట్‌పల్లి నాలా నుంచి కొట్టుకొచ్చినట్లుగా గుర్తించిన పోలీసులు… మృతదేహం చిత్యం రెడ్డి అనే మెదక్ జిల్లా వాసి గా గుర్తించారు.
రెస్క్యూ టీమ్ & అమీర్‌పేట్ పోలీసుల సహకారంతో మంగళవారం సాయంత్రం సమయంలో మృతదేహాన్ని బయటికి వెలికితీశారు. పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
మృతుని జేబులో లభించిన ఆధార్ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొన్న గోపాల్‌పేట్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Read Also : హత్యా? ఆత్మహత్యా? వాటర్ ట్యాంక్‌లో డెడ్ బాడీ.. అసలేం జరిగింది..