సీఎం కూతురు కే టోకరా వేసిన సైబర్ నేరగాళ్ళు

Delhi CM Kejriwal”s daughter loses Rs. 34,000 ti fraudster while trying to sell sofa set on OLX : సైబర్ నేరగాళ్లు మోసం చేయాలనుకుంటే వాళ్లువీళ్లనిలేదు. అవకాశం ఉన్నచోటల్లా తమ పంజా విసురుతూనే ఉంటారు.. తాజాగీ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత కేజ్రీవాల్ ను సైబర్ నేరగాళ్లు రూ. 34 వేలకు మోసం చేశారు.

హర్షిత కేజ్రీవాల్ ఇంట్లో ఉన్న సెకండ్ హ్యాండ్ సోఫాను అమ్మటానికి దాని వివరాలు ఆన్ లైన్ స్టోరే ఓఎల్ఎక్స్ (OLX) లో పోస్టు చేశారు. ఆమె ఇచ్చిన వివరాలు చూసిన ఒక వ్యక్తి ఆమెను సంప్రదించాడు. డీల్ కుదుర్చుకున్నాడు. డబ్బులు పంపిస్తానని చెప్పి ఓ బార్ కోడ్ ను స్కాన్ చేయమని లింక్ పంపించాడు. వెంటనే కొంత మొత్తం ట్రాన్సఫర్ చేశాడు. దాంతో ఆమెకు నమ్మకం కలిగింది.

ఆమెకు పంపిన లింక్, క్యూఆర్ కోడ్ ఉపయోగించి .. ఆ తర్వాత సైబర్ నేరస్ధుడు ఆమె ఎకౌంట్ నుంచి రూ.14,000 ఒకసారి, రూ.20,000 వేలు ఒకసారి దోచేశాడు. మోసపోయానని గ్రహించిన హర్షిత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఒక కుమారుడు,కుమార్తె ఉన్నారు. కుమార్తె హర్షిత ఇంటర్ లో (CBSE)96 శాతం పర్సెంటేజ్ సాధించి 2014లో వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. ఐఐటీ ఢిల్లీ నుంచి ఆమె కెమికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పూర్తి చేశారు.