Instagramలో గ్రూప్ చాట్.. గ్యాంప్ రేప్ చేయడంపై టీనేజర్ల డిస్కషన్

  • Publish Date - May 4, 2020 / 11:02 AM IST

సోషల్ మీడియా ఒక్కొక్కడికి ఒక్కో రకంగా ఉపయోగపడుతుంది. వాడుకున్నోడికి వాడుకున్నంత. అయితే మంచికన్నా చెడుకే ఎక్కువ ప్రభావం ఉండడం చూస్తునే ఉంటాం. స్నేహితులు కలిసి సరదా కబుర్లు చెప్పుకోవడం మామూలే కానీ, ఇలా చెడు కోసమే స్నేహితులు కలవడం కచ్చితంగా సాధారణ విషయం కాదంటోంది ఢిల్లీ టీనేజ్ గర్ల్. 

తన స్నేహితులతో పాటు మరికొందరు. ‘Boys locker room’ or ‘Bois Locker Room’ అనే గ్రూప్ క్రియేట్ చేసుకుని అశ్లీలంగా మాట్లాడుకుంటున్నారట. అందులో భాగంగానే గ్యాంగ్ రేప్ చేయడంపై డిస్కషన్ పెట్టుకుంటున్నారట. ఆ విషయాన్ని స్క్రీన్ షాట్ తీసిన గర్ల్ ట్విట్టర్ ద్వారా పంచుకుంది. 

‘కొందరు 17నుంచి 18సంవత్సరాల వయస్సున్న ఢిల్లీ యువకులు గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకున్నారు. దానికి ‘Boys locker room’ or ‘Bois Locker Room’ అనే పేరు పెట్టి చెత్త టాపిక్ లు మాట్లాడుకుంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా మార్ఫింగ్ ఇమేజ్‌లతో ఎంటర్ టైన్ అవుతున్నారు’

‘వారిలో ఇద్దరు మా స్కూల్ బాయ్స్ కూడా ఉన్నారు. నా స్నేహితులతో కలిసి దీనిని బయటపెడుతున్నాను. దీనిని చూసి మా అమ్మ నన్ను ఇనిస్టాగ్రామ్ క్లోజ్ చేసేయమంటోంది’ అని గర్ల్ ట్వీట్ చేసింది. అంతేకాకుండా మరికొన్ని గ్రూపులకు కూడా స్క్రీన్ షాట్లు పంపింది. నెటిజన్లు ఢిల్లీ పోలీసులు వీరిపై యాక్షన్ తీసుకోవాలని కామెంట్ చేస్తున్నారు. 

కాసేపటికి ఆ గర్ల్ తన ట్విట్టర్ అకౌంట్లో ఫొటోలు డిలీట్ చేసేసింది. నాకే అసహ్యంగా అనిపిస్తుంది. స్త్రీల ప్రైవేట్ పార్ట్స్ కనిపిస్తున్న ఫొటోలను పోస్టు చేయడం నాకే సిగ్గుగా ఉంది. దీనిని నేను వ్యతిరేకిస్తున్నా’ అని మరో ట్వీట్ పెట్టింది. 

Also Read | ఇంట్లోనే వైన్ తయారుచేస్తున్న తండ్రి-కొడుకులు అరెస్టు