Dead Body In Musi: మూసీలో మృతదేహం కేసు.. వీడిన మిస్టరీ.. భార్యపై కన్నేశాడనే అనుమానంతో దారుణం..
సంచలనం రేపిన మూసీలో మృతదేహం కేసులో మిస్టరీ ఎలా వీడింది? పోలీసులు హంతకులను ఎలా గుర్తించారు? అసలేం జరిగింది..

Dead Body In Musi: మూసీ నదిలో అనుమానాస్పదంగా కొట్టుకొచ్చిన మృతదేహం కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న అంబర్ పేట్ పోలీసులు నిజానిజాలు రాబట్టారు. దీన్ని హత్యగా గుర్తించారు. వైర్లు చుట్టి హత్య చేసినట్లుగా కనుగొన్నారు. హత్యకు పాల్పడ్డ ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
అంబర్ పేట్ డీసీపీ ఆఫీస్ లో.. డీసీపీ బాలస్వామి ఈ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. మహమ్మద్ జావిద్ (27), మహమ్మద్ అమీరుల్ హక్, షోరబ్ (30) ముగ్గురు స్నేహితులు. ఈ ముగ్గురు ఫాల్ సీలింగ్ వర్కర్లుగా పని చేస్తున్నారు. బోడుప్పల్ ద్వారకా నగర్ లో నివాసం ఉంటున్నారు. వీరు బీహార్ కు చెందిన వారు.
తన భార్య పై షోరబ్ కన్నేశాడని జావిద్ కు అనుమానం కలిగింది. ఈ క్రమంలో షోరబ్ ను అతడు మందలించాడు. తన భార్యకు దూరంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చాడు. అయినా షోరబ్ ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో షోరబ్ మర్డర్ కు ప్లాన్ వేశాడు. పథకం ప్రకారం అంబర్ పేట్ లోని మూసీ ప్రాంతానికి తీసుకెళ్లి అంతా మద్యం తాగారు.
ఆ తర్వాత అమీరుల్ హక్ సాయంతో వైర్ చుట్టి షోరబ్ ను హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని మూసీలో పడేశారు. షోరబ్ కనిపించకపోవడంతో అతడి ఫ్రెండ్ పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసును ఛేదించిన క్రైమ్ టీమ్ ను అభినందించి రివార్డ్ అందించారు పోలీసు ఉన్నతాధికారులు.
Also Read: ట్రంప్ యూటర్న్.. దెబ్బకి దిగొస్తున్నాడా?.. టారిఫ్ లతో వసూలు చేసిన డబ్బుల్లో సగం వాపస్?