Uttar Pradesh: శ్రద్ధా హత్య తరహాలో యూపీలో మరో ఘటన.. మహిళను చంపి ఆరు ముక్కలుగా నరికిన మాజీ ప్రియుడు
ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధ హత్య తరహాలో యూపీలో మరో ఘటన జరిగింది. ఒక వ్యక్తి తన మాజీ ప్రేయసిని చంపి, ముక్కలుగా నరికి బావిలో పడేశాడు.
- Narender Thiru
- Published On : November 21, 2022 / 03:07 PM IST
Uttar Pradesh: ఢిల్లీలో జరిగిన శ్రద్ధా హత్య ఘటన మరువక ముందే అలాంటి ఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో ఒక వ్యక్తి, తన మాజీ ప్రేయసిని చంపి ముక్కలుగా నరికాడు. శరీర భాగాల్ని బావిలో పడేశాడు. ఈ హత్యకు నిందితుడి కుటుంబ సభ్యులు కూడా సహకరించడం గమనార్హం.
Zomato layoffs: కొనసాగుతున్న ఉద్యోగుల తొలగింపు… ఇప్పుడో జొమాటో వంతు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రిన్స్ యాదవ్ అనే వ్యక్తి, ఆరాధన అనే మహిళ కొంతకాలం ప్రేమించుకున్నారు. అయితే, ఇటీవల ఆరాధన వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో ఆరాధనపై పగ పెంచుకున్న ప్రిన్స్ ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ నెల 9న ఆమెను బైక్‌పై గుడికి ఎక్కించుకుని వెళ్లాడు. తర్వాత సమీపంలోని చెరుకు తోటలోకి తీసుకెళ్లి బంధువు సహాయంతో గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఆరు ముక్కలుగా నరికాడు. వాటిని బావిలో పడేసి వెళ్లిపోయాడు. తర్వాత మహిళ మృతదేహం బావిలో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరపగా అసలు విషయం బయటపడింది.
Twitter: ఉద్యోగులపై మళ్లీ వేటు? బెడిసి కొట్టినా బెదిరేదే లేదంటున్న మస్క్
పోలీసులు నిందితుడు ప్రిన్స్ యాదవ్, అతడి బంధువులను అరెస్టు చేశారు. కాగా, నిందితుడిని ఘటనా స్థలానికి తీసుకెళ్లగా పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అయితే, పోలీసులు తిరిగి కాల్పులు జరపడంతో అతడి కాలికి బుల్లెట్ గాయమైంది. ప్రస్తుతం పోలీసులు మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, దర్యాప్తు జరుపుతున్నారు.
