Twitter: ఉద్యోగులపై మళ్లీ వేటు? బెడిసి కొట్టినా బెదిరేదే లేదంటున్న మస్క్

రోజుకు 12 గంటల పాటు పనిచేయాలంటూ ఇటీవల మస్క్ ట్విటర్ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే గొడ్డు చాకిరీ తమ వల్లకాదంటూ అనేక మంది సంస్థను వీడారు. ఈ దఫా ఏకంగా 1200 మంది రాజీనామా చేసారట. ఇంత జరిగినప్పటికీ మరింత మంది ఉద్యోగులను తొలగించే ఆలోచనలో మస్క్ ఉన్నట్లు చర్చనీయాశం అవుతోంది.

Twitter: ఉద్యోగులపై మళ్లీ వేటు? బెడిసి కొట్టినా బెదిరేదే లేదంటున్న మస్క్

Elon Musk plans to fire more employees at Twitter in second round of layoffs

Twitter: ఇప్పటికే ట్విట్టర్ నుంచి 50 శాతం మంది ఉద్యోగులను తొలగించారు మస్క్. ట్విట్టర్ చేజిక్కించుకునప్పటి నుంచి ఉద్యోగులపై వేటు వేస్తూనే ఉన్నారు. వాస్తవానికి ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం వల్ల సంస్థపై భారం పడుతోంది. రోజూవారి కార్యకలాపాలు బాగా ఇబ్బందికరంగా మారినట్లు ట్విట్టర్ వర్గాల నుంచి సమాచారం. అయితే ఇంత జరుగుతున్నా మస్క్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఇప్పటికి జరిగిన తొలగింపులు సరిపోనట్లు, మరోసారి ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

రోజుకు 12 గంటల పాటు పనిచేయాలంటూ ఇటీవల మస్క్ ట్విటర్ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే గొడ్డు చాకిరీ తమ వల్లకాదంటూ అనేక మంది సంస్థను వీడారు. ఈ దఫా ఏకంగా 1200 మంది రాజీనామా చేసారట. ఇంత జరిగినప్పటికీ మరింత మంది ఉద్యోగులను తొలగించే ఆలోచనలో మస్క్ ఉన్నట్లు చర్చనీయాశం అవుతోంది.

ఈసారి తొలగింపుల్లో సెల్స్ అండ్ మార్కెటింగ్, పార్ట్‌నర్‌షిప్ విభాగాల్లో కోతలు చేపట్టేందుకు మస్క్ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఇందుకు సిద్ధంగా ఉండాలంటూ ఆయా శాఖల అధిపతులకు ఇప్పటికే సమాచారం వెళ్లిందట. అయితే దిగువస్థాయి సిబ్బందిని తొలగించేందుకు తాము సిద్ధంగా లేమని వారు మస్క్‌కు తేల్చి చెప్పారట. ఇలా చెప్పినందుకు ఏకంగా వారు తమ ఉద్యోగాలు కోల్పోయినట్టు అంతర్జాతీయ మీడియా ఒకటి పేర్కొంది.

44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను చేజిక్కించుకున్న మస్క్, సంస్థలో కాలుపెట్టిన కొద్ది రోజులకే ఆయన సంస్థ ఉద్యోగుల్లో ఏకంగా 50 శాతం మందిని తొలగించారు. వర్క్ ఫ్రం హోం పాలసీని కూడా రద్దు చేశారు. ట్విటర్‌ను గాడినపెట్టేందుకు ఉద్యోగులు రోజుకు 12 గంటలు పనిచేయడానికి ఎంత మాత్రం వెనకాడకూడదంటూ మస్క్ పంపిన మెయిల్ కలకలం రేపింది. మస్క్ ఆదేశాలు పాటించడం తమ వల్ల కాదంటూ వందల మంది ఇప్పటికే ఇంటికెళ్లిపోయారు. ఇది ప్రభావాన్ని చూపిస్తోందంటే, ఉద్యోగులు లేక కొన్ని దేశాల్లోని ట్విటర్ కార్యాలయాలు నిర్మానుష్యంగా మారాయట.

Whatsapp: వాట్సాప్‭లో మరో కొత్త ఫీచర్.. ఇక నుంచి లాక్ ఉంటేనే యాప్ ఓపెన్