ఇంకెన్నాళ్లు : దిశా కేసు..మృతదేహాలు ఇవ్వాలి..శవాలతో ఆడుకుంటున్నరు

  • Publish Date - December 9, 2019 / 10:57 AM IST

దిశ నిందితుల మృతదేహాలు ఇంకా ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు కుటుంబసభ్యులు. వెంటనే తమకు అప్పచెప్పాలని, కనీసం వారి ముఖాలైనా చూసుకుంటామంటున్నారు. తమపై కనికరం చూపించాలని వేడుకుంటున్నారు.

* ఎన్‌కౌంటర్‌ చేశారు… ఇప్పుడు మృతదేహాలనైనా అప్పగిస్తే చివరి చూపైనా చూస్తామంటున్నారు చెన్నకేశవులు తండ్రి కురుమయ్య.
* వాయిదా వేస్తే ఎదురుచూసే ఓపిక నశించిందంటున్నారు. ఇన్నాళ్లు ఉంచుకున్నా కోపం తీరలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది చెన్నకేశవులు భార్య. మాపై కక్ష కడుతున్నారంటూ * మండిపడింది. 
* కనీసం అంత్యక్రియులు చేసుకోవడానికైనా మృతదేహాలను అప్పగించాలంటూ వేడుకుంటున్నారు శివ తండ్రి రామయ్య. 

మరోవైపు దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. నిందితుల మృతదేహాల అప్పగింతకు హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. శుక్రవారం వరకు మృతదేహాలను గాంధీ ఆస్పత్రిలో భద్రపరచాలని.. ప్రభుత్వాన్ని ఆదేశించింది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను కోర్టు పరిశీలించింది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై.. బుధవారం సుప్రీంకోర్టులో విచారణ ఉన్నందున.. తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది హైకోర్టు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే  ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిందని ఆయన హైకోర్టుకు తెలిపారు.

* దిశ హత్యాచార నిందితులను పోలీసులు 2019, డిసెంబర్ 06వ తేదీ శుక్రవారం తెల్లవారు జామున ఎన్‌కౌంటర్‌ చేశారు. 
* షాద్‌నగర్‌ సమీపంలోని చటాన్‌పల్లి దగ్గర క్రైమ్‌ సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా నిందితులు పారిపోవడానికి ప్రయత్నం చేశారు. 
* నలుగురు నిందితులను పోలీసులు కాల్చి చంపారు. 
* 2019, నవంబర్ 27వ తేదీన దిశపై నలుగురు నిందితులు అత్యాచారం చేశారు. 

* అనంతరం మృతదేహాన్ని చటాన్‌పల్లి బ్రిడ్జి దగ్గర కాల్చివేశారు. 
* ఆరీఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్న కేశవులుగా గుర్తించారు.
* దిశ కేసులో నిందితులను గురువారం 2019, డిసెంబర్ 5వ తేదీన పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
Read More : సజ్జనార్‌పై హత్య కేసు: పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్చారు