Disturbing Video: అమానుషం.. రోజూ అరుస్తోందని కుక్కను ఇటుకతో కొట్టి చంపిన ఉన్మాది.. వీడియోలో రికార్డైన ఘటన
మూగ జీవిపై కర్కశం చూపించాడో దుర్మార్గుడు. నిద్రిస్తున్న కుక్కపై ఇటుక రాయి విసిరి చంపేశాడు. అనంతరం అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు జరిపారు.
- Narender Thiru
- Published On : October 16, 2022 / 07:47 PM IST
Disturbing Video: ఉత్తర ప్రదేశ్‌లో అమానవీయ ఘటన జరిగింది. నిద్రిస్తున్న కుక్కను ఇటుకతో కొట్టి చంపాడో ఉన్మాది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్, కాన్పూర్ జిల్లా, జుహీ ప్రాంతంలో ఇటీవల ఈ ఘటన జరిగింది. ఒక కుక్క రోజూ అరుస్తూ ఉండేది. దీంతో విసుగు చెందిన స్థానికుడు పెద్ద ఇటుక తీసుకొచ్చి, ఇంటి పక్కన నిద్రిస్తున్న ఆ కుక్కపై బలంగా విసిరేశాడు. ఇటుక గట్టిగా తగలడంతో ఆ కుక్క విలవిలలాడుతూ అక్కడే మరణించింది. దూరంగా ఆ దృశ్యాన్ని చూసిన వాళ్లు విస్తు పోయారు. కుక్కపై ఇటుక విసిరేసిన తర్వాత నిందితుడు నెమ్మదిగా అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. కుక్క మరణించిన తర్వాత మరో కుక్క తన కోసం అక్కడికి రావడం వీడియోలో కనిపించింది. ఈ దారుణ ఘటన అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Man Kills Wife: కూతురుకు తన పోలికలు లేవని దారుణం.. భార్య, కూతురును హత్య చేసిన దుర్మార్గుడు
ఈ ఘటనను పలువురు తీవ్రంగా ఖండించారు. కుక్కను చంపిన నిందితుడిని అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేశారు. దీంతో స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపారు. సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా వెల్లడించారు.
— POLICE COMMISSIONERATE KANPUR NAGAR (@kanpurnagarpol) October 16, 2022
