Man Kills Wife: కూతురుకు తన పోలికలు లేవని దారుణం.. భార్య, కూతురును హత్య చేసిన దుర్మార్గుడు

కూతురుకు తన పోలికలు లేవని ఏడాది వయసున్న చిన్నారిని హత్య చేశాడో కసాయి తండ్రి. అంతేకాదు.. భార్యనూ చంపేశాడు. ఈ ఘటన ఈ నెల 1న ఆగ్రాలో జరిగింది.

Man Kills Wife: కూతురుకు తన పోలికలు లేవని దారుణం.. భార్య, కూతురును హత్య చేసిన దుర్మార్గుడు

Man Kills Wife: భార్యపై అనుమానంతో కూతురును, భార్యను హత్య చేశాడో దుర్మార్గుడు. కూతురుకు తన పోలికలు లేవని దారుణానికి తెగబడ్డాడు. ఈ ఘటన ఇటీవల ఆగ్రా పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగ్రా, ఖండ్వాలి ప్రాంతానికి చెందిన మన్మోహన్ సింగ్‌కు, మమతకు కొంత కాలం క్రితం పెళ్లైంది.

Pawan Kalyan : యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం, ప్రజల్లో మార్పు వచ్చే వరకు పోరాటం చేస్తాం- పవన్ కల్యాణ్

వారికి సౌమ్య అనే ఏడాది వయసున్న కూతురుంది. అయితే, సౌమ్యకు తన పోలికలు లేవని మన్మోహన్ భావించాడు. తన ముఖానికి, సౌమ్య ముఖానికి సంబంధం లేదని అనుమానించాడు. దీంతో ఆ పాప తన కూతురు కాదేమోనని భావించి, భార్యతో అనేకసార్లు వాగ్వాదానికి దిగాడు. చాలాసార్లు గొడవపడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ పాప తన కూతురు కాదని, భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ నెల 1న భార్యను, కూతురు సౌమ్యను హత్య చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.