Pawan Kalyan: కిటికీలోంచి పవన్ అభివాదం.. సీఎం థానోస్ అంటూ జగన్‌పై పవన్ సెటైర్.. ఆసక్తి రేపుతున్న ట్వీట్లు

పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో విశాఖపట్నంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆయన బస చేసిన హోటల్ వద్దకు అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ తను ఉంటున్న హోటల్ కిటికీలోంచి అభివాదం చేశారు.

Pawan Kalyan: కిటికీలోంచి పవన్ అభివాదం.. సీఎం థానోస్ అంటూ జగన్‌పై పవన్ సెటైర్.. ఆసక్తి రేపుతున్న ట్వీట్లు

Updated On : October 16, 2022 / 5:22 PM IST

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా విశాఖపట్నంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో పవన్ తాను బస చేసిన హోటల్ వదిలి బయటకు రాలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పవన్ తాను ఉంటున్న నోవాటెల్ హోటల్ కిటికీలోంచి, తన కోసం ఎదురు చూస్తున్న అభిమానులు, కార్యకర్తలకు అభివాదం చేశారు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్‪కు పోలీసుల నోటీసులు.. పలు కార్యక్రమాలు రద్దు చేసుకున్న పవన్.. విశాఖ వదిలి వెళ్తారా?

అక్కడి దృశ్యాల్ని వీడియో తీసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌పై సెటైర్లు వేశారు. ‘‘ప్రముఖ నాయకుడు, సీఎం థానోస్ ఆధ్వర్యంలో మన ప్రియమైన పోలీసులు జనసేన తరఫున ఎలాంటి కార్యక్రమాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించకుండా అడ్డుకున్నారు. నాకు మిగిలింది ఈ ఒక్క అవకాశం మాత్రమే. కిటికీలోంచి అభివాదం చేడయం మినహా మరో అవకాశం లేదు. ఏపీ పోలీసులు కిటికీలోంచి అభివాదం కూడా చేయద్దని చెప్పరనే అనుకుంటున్నా’’ అంటూ ట్వీట్ చేశారు. పవన్ కోసం హోటల్ వద్దకు భారీ స్థాయిలో అభిమానులు, జనసేన కార్యకర్తలు చేరుకుంటున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

Madhya Pradesh: డబ్బు కోసం గూగుల్ మేనేజర్ కిడ్నాప్.. పెళ్లి పేరుతో నాటకం.. రూ.40 లక్షలు డిమాండ్

వారిని అదుపు చేసేందుకు అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు అభిమానులు హోటల్ వైపు రాకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. హోటల్ పరిసరాల్లోకి చొచ్చుకురాకుండా ఉండేందుకు రోప్‌లు ఏర్పాటు చేశారు. అయితే, పోలీసులు ఎంత కంట్రోల్ చేసినా అభిమానుల రాక తగ్గడం లేదు.