Madhya Pradesh: డబ్బు కోసం గూగుల్ మేనేజర్ కిడ్నాప్.. పెళ్లి పేరుతో నాటకం.. రూ.40 లక్షలు డిమాండ్

గూగుల్ సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తిని డబ్బు కోసం కిడ్నాప్ చేసిందో కుటుంబం. అమ్మాయిని ఎరగా వేసి, భోపాల్ రప్పించి, బలవంతంగా పెళ్లి చేశారు. తర్వాత డబ్బు డిమాండ్ చేశారు.

Madhya Pradesh: డబ్బు కోసం గూగుల్ మేనేజర్ కిడ్నాప్.. పెళ్లి పేరుతో నాటకం.. రూ.40 లక్షలు డిమాండ్

Updated On : October 16, 2022 / 4:05 PM IST

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఒక కుటుంబం డబ్బు కోసం దారుణానికి తెగబడింది. గూగుల్ సంస్థలో మనేజర్‍గా పని చేస్తున్న ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి, ఒక అమ్మాయితో బలవంతంగా పెళ్లి చేశారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్‪కు పోలీసుల నోటీసులు.. పలు కార్యక్రమాలు రద్దు చేసుకున్న పవన్.. విశాఖ వదిలి వెళ్తారా?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గణేష్ శంకర్ అనే వ్యక్తి బెంగళూరు, గూగుల్ సంస్థలో సీనియర్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అతడికి కొద్ది రోజుల క్రితం ఐఐఎమ్ షిల్లాంగ్‌లో ఎంబీయే చదువుతున్న సుజాత అనే అమ్మాయి పరిచయమైంది. సుజాత స్వస్థలం భోపాల్. సుజాత ద్వారా ఆమె కుటుంబ సభ్యులు గణేష్ శంకర్‌ను భోపాల్ రప్పించుకున్నారు. అనంతరం అతడిని కిడ్నాప్ చేసి, మత్తు మందు ఇచ్చి ఒక రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారు. తర్వాత అతడికి, సుజాతతో బలవంతంగా పెళ్లి చేయించారు. దీనికి సంబంధించి కొన్ని ఫొటోలు, వీడియోలు తీశారు. తర్వాత రూ.40 లక్షల డబ్బు డిమాండ్ చేశారు.

Pawan Kalyan: నిన్నటి దాడులు కోడి కత్తి కేసులాంటివే: పవన్ కల్యాణ్

తాము అడిగినట్లుగా డబ్బు ఇవ్వకుంటే ఆ ఫొటోలు, వీడియోలు బయటపెడతామని, అమ్మాయిని ఇబ్బందిపెట్టేందుకు ప్రయత్నించావని కేసులు పెడతామని బెదిరించారు. ఈ మేరకు అతడ్ని విడిచిపెట్టారు. అయితే, గణేష్ శంకర్.. స్థానిక కమలా నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు సుజాతతోపాటు, ఆమె తండ్రి, ఇతర కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.