Pawan Kalyan: పవన్ కల్యాణ్‪కు పోలీసుల నోటీసులు.. పలు కార్యక్రమాలు రద్దు చేసుకున్న పవన్.. విశాఖ వదిలి వెళ్తారా?

విశాఖపట్నం వదిలి వెళ్లాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. స్వయంగా పవన్ ఈ నోటీసులు అందుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ పలు కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు.

Pawan Kalyan: పవన్ కల్యాణ్‪కు పోలీసుల నోటీసులు.. పలు కార్యక్రమాలు రద్దు చేసుకున్న పవన్.. విశాఖ వదిలి వెళ్తారా?

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ విశాఖపట్నం పర్యటన సందర్భంగా ఉద్రిక్తత కొనసాగుతోంది. పవన్ కల్యాణ్‌కు విశాఖ పోలీసులు నోటీసులు అందజేశారు. పవన్‌తోపాటు జనసేన నేతలకు సెక్షన్ 41ఏ కింద పోలీసులు నోటీసులు జారీ చేశారు.

Pawan Kalyan: నిన్నటి దాడులు కోడి కత్తి కేసులాంటివే: పవన్ కల్యాణ్

ఆదివారం మధ్యాహ్నం ఈ నోటీసుల్ని పవన్ స్వయంగా అందుకున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందన పవన్ విశాఖ వదిలి వెళ్లాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు తమ కార్యకర్తలు, నేతలపై కేసులు ఉపసంహరించుకోవాలని పవన్ పోలీసుల్ని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన తమ పార్టీ నేతల్ని వెంటనే విడుదల చేయాలన్నారు. పోలీసుల నోటీసుల నేపథ్యంలో పవన్ తన కార్యక్రమాల్ని రద్దు చేసుకున్నారు. చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా పవన్.. తాను బస చేసిన హోటల్ నుంచే పూర్తి చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో పవన్ కల్యాణ్.. విశాఖలో ఉంటారా? వెళ్లిపోతారా? అనే అంశంలో సందిగ్ధత నెలకొంది.

Pawan Kalyan: వైకాపా గూండాల ఉడుత ఊపులకు భయపడం.. నిన్నటి ఘటన కోడికత్తిని గుర్తుకుతెస్తుంది.. తాత్కాలికంగా జనవాణి కార్యక్రమం వాయిదా..

నోటీసులు తీసుకున్న అనంతరం పవన్ మాట్లాడారు. ‘‘ప్రజల కోసం పోరాడితే నోటీసులు ఇస్తున్నారు. మేం విశాఖపట్నం రాకముందే గొడవలు జరిగితే.. మేం వచ్చి రెచ్చగొట్టడం వల్లే ఘటన జరిగినట్లుగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఎన్ని కేసులు పెట్టినా, జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం. ఉత్తరాంధ్ర దోపిడీని చూపిస్తామని ఇక్కడ డ్రోన్ల వాడకాన్ని నిషేధించారు. నేర చరిత్ర గల నేతలు పోవాలంటే ప్రజల్లో మార్పు రావాలి’’ అని పవన్ అన్నారు.