షాద్ నగర్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణ హత్య సంచలనం రేపుతోంది. అసలు ఏం జరిగింది? ప్రియాంకారెడ్డిని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనేది మిస్టరీగా
షాద్ నగర్ లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణ హత్య సంచలనం రేపుతోంది. అసలు ఏం జరిగింది? ప్రియాంకారెడ్డిని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనేది మిస్టరీగా మారింది. ఈ కేసుని సవాల్ గా తీసుకున్న పోలీసులు మిస్టరీని చేధించే పనిలో పడ్డారు. కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా ప్రియాంకారెడ్డిని లారీ డ్రైవర్లు హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. లారీ డ్రైవర్లు ఉన్నారు అని భయపడుతూ ప్రియాంకారెడ్డి కుటుంబసభ్యులకు ఫోన్ చేశారు. దీంతో లారీ డ్రైవర్లపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రియాంకారెడ్డి నవాబుపేట మండలం కొల్లూరులోని ఆసుపత్రిలో వెటర్నరీ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే బుధవారం(నవంబర్ 27, 2019) ఆఫీస్ కి వెళ్లారు. విధులు ముగించుకుని సాయంత్రం తన స్కూటీపై ఇంటికి వెళ్తున్నారు. ఆ సమయంలో ఆమె స్కూటీ పంక్చర్ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులకు ఫోన్ లో చెప్పారు. అటుగా వెళ్తున్న లారీ డ్రైవర్లు కొందరు.. స్కూటీని రిపేర్ చేస్తామని తీసుకెళ్లారని ప్రియాంకారెడ్డి కుటుంబసభ్యులతో చెప్పారు. తన స్కూటీని పంక్చర్ వేయిస్తానని క్లీనర్‌కు ఇచ్చి పంపారని.. కొద్ది సేపటికి వచ్చిన క్లీనర్ పంక్చర్ షాపు లేదన్నాడని ప్రియాంకారెడ్డి చెప్పారు. తాను స్కూటీ తీసుకెళ్తానంటే అడ్డుపడుతున్నాడని.. వాడు దయ్యంలా ఉన్నాడని.. తనను కదలనివ్వడం లేదని ప్రియాంక ఫోన్ లో తెలిపారని తెలుస్తోంది. ప్రియాంక ఏడుస్తుండగానే ఫోన్ కట్ అయ్యిందని ప్రియాంక స్నేహితురాలు చెప్పింది.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో డాక్టర్ ప్రియాంకారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. 24వ నేషనల్ హైవే దగ్గర ఉన్న ఓ వంతెన కింద ప్రియాంకారెడ్డిని మృతదేహాన్ని గుర్తించారు. బైపాస్ రోడ్డులోని అండర్ బ్రిడ్జి కింద పూర్తిగా తగులబడిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. ప్రియాంకారెడ్డిని వేరే ప్రాంతంలో హత్య చేసి..ఇక్కడికి తీసుకొచ్చి తగలబెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రియాంకారెడ్డి కాల్ లిస్ట్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. సమీపంలో ఉన్న సీసీ టీవీ పుటేజ్ లను కూడా పరిశీలిస్తున్నారు. బుధవారం (నవంబర్ 27) సాయంత్రం నుంచి ప్రియాంకారెడ్డి ఆచూకీ లేకుండా పోయారు. ఆమె కోసం పోలీసులు వెతుకుండగానే..గురువారం(నవంబర్ 28,2019) తెల్లవారుజామున చటాన్‌పల్లి బ్రిడ్జి కింద ప్రియాంక శవమై కన్పించారు. ఎవరు హత్య చేశారు? ఎందుకు చేశారు? అనేది తెలుసుకునే పనిలో పోలీసులు పడ్డారు.