Double Murder case :అడవిలో సగం కాలిన భార్యాభర్తల మృతదేహాలు..! హంతకుల కోసం వేటాడుతున్న పోలీసులు

అడవిలో సగం కాలిన భార్యాభర్తల మృతదేహాలు పెను సంచలన కలిగిస్తున్నాయి. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో జరిగిన ఈ జంట హత్యల గురించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Half Burnt Dead Bodies In Forest

Half burnt dead bodies In Forest : జార్ఖండ్‌ లో అత్యంత దారుణ ఘటన జరిగింది. భార్యాభర్తలను ఎవరో హత్య చేశారు. అడవిలో సగం కాలిన రెండు మృతదేహాలను గుర్తించిన పోలీసులు స్థానికులను ప్రశ్నించినా వారు ఏమాత్రం నోరు విప్పటంలేదు. పశ్చిమ సింగ్‌భూమ్‌ సమీప అడవిలో సగానికి కాలిపోయిన భార్యాభర్తల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో లభ్యమైన ఈ రెండు మృతదేహాలు స్థానికంగా పెను సంచలనం సృష్టించాయి. ఈ డబుల్ మర్డర్ ఈ కేసులో పోలీసులకు అందిన సమాచారం ప్రకారం మూఢ నమ్మకాల కారణంగా జరిగినట్టు తెలుస్తోంది.

ఈ సంచలన కేసు జిల్లాలోని నక్సల్స్ ప్రభావిత టోంటో పోలీస్ స్టేషన్ పరిధిలోని బొండు గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ హత్యలపై గ్రామస్థులు మాత్రం నోరు మెదపటంలేదు. దీనికి కారణం ఈ హత్యల హంతకులకు భయపడి కూడా కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఈ డబుల్ మర్డర్ల కేసు గురించి పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

టోంటో పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్యంత నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బొండూ గ్రామం. తరచు నక్సల్స్ హల్ చల్ ఉంటుంటాయి. బొండూ గ్రామంలో నివసించే గోమీ కెరాయ్, అతని భార్య హత్యకు గురైనట్లు గ్రామస్థుల నుంచి పోలీసు సూపరింటెండెంట్‌కు ఎవరో సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసు బలగాలు ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ ముమ్మరం చేశారు.

ఎస్పీ అజయ్ లిండా ఆధ్వర్యంలో ఎస్‌డీపీఓ జగన్నాథ్‌పూర్ ఇకుర్ డంగ్‌డుంగ్, ఎస్‌డీపీఓ కిరిబూరు అజిత్ కుమార్ కుజూర్ నేతృత్వంలో పోలీసుల బృందం ఆదివారం (జనవరి 30,2022) అడవిలో ఆధారాల కోసం గాలించారు. కానీ ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు. హంతకులు చాలా పక్కాగా ప్లాన్ చేసి హత్య చేసినట్లుగా భావిస్తున్నారు పోలీసులు.

ఎంత క్షుణ్ణంగా పరిశీలించినా..స్థానికులను విచారించినా ఎటువంటి వివరాలు తెలియరాలేదు. బొండూ గ్రామ ప్రజలు ఎటువంటి వివరాలు చెప్పట్లేదు. పోలీసులకు సమాచారం ఇవ్వవద్దని హంతకులు గ్రామస్థులను బెదిరించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఘటనపై ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ కూడా ఇచ్చారని పోలీసుల దర్యాప్తులో తెలుస్తోంది.

దీంతో జనవరి 20న హత్యలు జరిగినా..ఎటువంటి వివరాలు తెలియటంలేదని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఏ చిన్న ఆధారం దొరికినా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ కేసులో మృతుడి సోదరుడు, మరికొందరి ప్రమేయమున్నట్లు ఎస్‌డిపిఒ కిరిబూరు అజిత్‌కుమార్‌ కుజూర్‌ తెలిపారు. మూఢనమ్మకాలు, మద్యపానం ఈ హత్యలకు దారి తీసి ఉంటుందని కానీ దీనికి తగిన స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదని మీడియాకు వెల్లడించారు.