87ఏళ్ల హంతకుడు: బ్రేక్ బదులు ఎక్సిలేటర్ తొక్కి..

వెనుక నడుచుకుంటూ వస్తున్న జీనెట్ ను పట్టించుకోలేదు. ఆమెకు తగలడానికి ఒక్క క్షణం ముందు  చూసినా ప్రయోజనం లేకుండా పోయింది. కంగారులో బ్రేక్ నొక్కబోయి ఎక్సలేటర్ తొక్కేశాడు.

వెనుక నడుచుకుంటూ వస్తున్న జీనెట్ ను పట్టించుకోలేదు. ఆమెకు తగలడానికి ఒక్క క్షణం ముందు  చూసినా ప్రయోజనం లేకుండా పోయింది. కంగారులో బ్రేక్ నొక్కబోయి ఎక్సలేటర్ తొక్కేశాడు.

విలియం హీగ్రెన్ (87)పొరబాటు కారణంగా జీనట్ న్యూమన్ (64)ప్రాణాలు కోల్పోయింది. ఇలా చేయడం విలియంకు కొత్తేం కాదు. మే 26న సారా టేలర్ (53)ను కూడా ఇలాగే గుద్దేశాడు. సీసీటీవీ ఆధారంగా నిందితుణ్ని పట్టుకున్నారు పోలీసులు. పశ్చిమ లండన్‌లోని సైన్‌బరీ పార్క్‌లో నిలిపి ఉంచిన వాహనాన్ని రివర్స్ చేయబోయాడు విలియం. 

వెనుక నడుచుకుంటూ వస్తున్న జీనెట్ ను పట్టించుకోలేదు. ఆమెకు తగలడానికి ఒక్క క్షణం ముందు  చూసినా ప్రయోజనం లేకుండా పోయింది. కంగారులో బ్రేక్ నొక్కబోయి ఎక్సలేటర్ తొక్కేశాడు. బ్రేక్ అనుకుని గట్టిగా తొక్కడంతో ఫుల్ స్పీడ్‌తో కారు వెళ్లిపోయింది. 

అప్పటికే మహిళను తొక్కేసి వంద అడుగుల దూరం వెళ్లిపోయింది. పుర్రెకు గట్టి దెబ్బలు తగలడంతో పాటు, ముఖానికి, రిబ్స్‌కు బాగా గాయలయ్యాయి. బ్రెయిన్ లోని రక్తం గడ్డ కట్టడంతో అపస్మారక స్మితికి చేరుకుంది. 

హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న మహిళ ఆపరేషన్ ఫెయిలవడంతో మృతి చెందింది. పోలీసులు ఆ వృద్ధ నేరస్థుడిపై కేసు నమోదు చేశారు. 70సంవత్సరాలు దాటిన వ్యక్తులు మరోసారి డ్రైవింగ్ టెస్టులో పాల్గొనాలని అందులో ఉత్తీర్ణత సాధిస్తేనే డ్రైవింగ్ కు అనుమతించాలని అధికారులు తెలుపుతున్నారు.